Man Tiger Viral Video: పులి.. ఈ పేరు వినిపిస్తేనే చాలు వణుకు పుడుతుంది. డిస్కవరీ ఛానల్ లో చూస్తుంటేనే భయం కలుగుతుంది. రాత్రి కలలో పులి కనిపిస్తే నిద్ర అమాంతం ఎగిరిపోతుంది. అలాంటిది ఓ బలమైన పులి అతని వద్దకు వచ్చింది. దాడి చేయకుండా వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. ఇంకొన్ని వీడియోలు ఆలోచనను రేకిపిస్తున్నాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తీవ్రస్థాయిలో చర్చకు కారణమవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఓ ప్రాంతంలో రాత్రిపూట ఓ వ్యక్తి ఒక షాపు వద్ద పడుకున్నాడు. అప్పటికి సమయం రాత్రి అయింది. ఆ ప్రాంతం మొత్తం నిద్రలో ఉంది. అతడు కూడా ఓ షాపు ఎదుట నిద్రపోతున్నాడు. ఈలోగా ఒక పులి అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. పడుకున్న అతడిని దుప్పటి పట్టి లాగింది. అతడు గాఢ నిద్రలో నుంచి లేచాడు. అంతే కొద్ది క్షణాలపాటు అతనిని చూసిన పులి.. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వాస్తవానికి ఆ పులి అతని మీద దాడి చేయడానికి వచ్చింది. కానీ అతడు అప్పటికే ఫూటుగా మద్యం తాగాడు. ఆ మత్తులో పడుకున్నాడు. ఈలోగా పులి వచ్చి అతడి మీద ఉన్న దుప్పటి లాగింది. మద్యం తాగడం వల్ల అతడి నోటి నుంచి తీవ్రస్థాయిలో వాసన వచ్చింది. ఆ వాసన తట్టుకోలేక ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ అతడు గనక మద్యం తాగి ఉండకపోతే పులి అతడి పని పట్టేది. మద్యం తాగడం వల్ల.. ఆ వాసన పులికి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
Also Read: ‘చెత్త’ వివాదం.. ఇళ్లు పీకి పందిరి వేసిన మహిళలు.. లోకల్ ఫైట్ వైరల్!
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి పులి ఎంతటి జంతువునైనా వేటాడుతుంది. ఎంతటి మనిషి నైనా సరే దాడి చేసి చంపేస్తుంది. అందుకే పులి అంటే చాలామంది భయపడతారు. జంతువులు కూడా వణికి పోతాయి. అయితే అలాంటిది పెద్దపులి తన దగ్గరికి వచ్చిన సరే ఆ వ్యక్తి భయపడలేదు. చివరికి పెద్దపులినే భయపెట్టించాడు. ఈ లెక్కన చూస్తే అతడు ఏ స్థాయిలో మద్యం తాగాడో.. అతడి నోటి నుంచి వచ్చే వాసనకు పులి భయపడిందంటే మామూలు విషయం కాదు. సాధారణంగా ఎవరైనా మద్యం కొంత పరిమాణంలో తాగుతారు. కానీ అతడు ఏకంగా వైన్ షాపులో ఉన్న మద్యం మొత్తం తాగి ఉంటాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: జోరుగా వరద ప్రవాహం.. వద్దన్నా వినకుండా ముందుకు వెళ్లిన లారీ డ్రైవర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చర్చకు కారణమవుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోను తాము చూడలేదని మెజారిటీ నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కూడా చిత్రంగా ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటాయని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని అందరూ అంటారు.. కానీ మద్యం తాగితే క్రూరమైన పులిని కూడా భయపడవచ్చని ఇతడు నిరూపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు.