19th Century Champagne: సముద్రంలో మునిగిపోయిన నౌక.. అందులో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం.. వాటికోసం తండ్లాట..

సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలు, షిప్‌లు ప్రమాదవశాత్తు సముద్రాల్లో మునిగిపోతుంటాయి. టైటానిక్‌ షిప్‌ ఇలాగే మునిగిపోయింది. తర్వాత గతంలో సముద్ర గర్భంలో మునిగిన ఓ ఓడలో భారీగా బంగారం ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఓ ఓడలో మద్యం గుర్తించారు.

Written By: Raj Shekar, Updated On : August 8, 2024 2:06 pm

19th Century Champagne

Follow us on

19th Century Champagne: దక్షిణ స్వీడన్‌ సముద్ర తీరంలోని సముద్రంలో మునిగిపోయి ఓ ఓడ శిథిలాలను ఇటీవల గుర్తించారు. ఇందులో 19వ శతాబ్దానికి చెందిన దాదాపు వంద బాటిళ్ల షాంపైన్, మినరల్‌ వాటర్‌ సీసాలను ఉన్నట్లు గుర్తించారు. సముద్రపు అడుగు భాగాన శిథిలమైన ఈ ఓడను 2016 లోనే గుర్తించినప్పటికీ, గత నెలలో పోలండ్‌కు చెందిన స్కూబా డైవర్లు ఆ ఓడలోకి ప్రవేశించడంతో విలువైన మద్యం ఉన్నట్టు తెలిసింది. ఈ పడవ దక్షిణ స్వీడన్‌లోని బాల్టిక్‌ సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్లు ( 37 కిలోమీటర్లు) దూరంలో 190 అడుగుల లోతులో ఉందని గుర్తించారు. జులై 11న పోలండ్‌ స్కూబా డైవర్లు అందులోని షాంపైన్, మినరల్‌ వాటర్‌ బాటిళ్లు ఉన్నట్టు కనుగొన్నారు. పురాతనమై ఈ మద్యాన్ని పరీక్షించేందుకు స్కూబా డైవర్లపై నిపుణులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో 1850 ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్న మునిగిపోయిన నౌకను ‘పురాతన అవశేషం’గా స్వీడన్‌ అధికారులు ప్రకటించారు. ఈ మద్యం బయటకు తీయడం కుదరదని స్పష్టం చేశారు. నౌకలోని షాంపైన్‌ బాటిళ్లు సహా ఇతర వస్తువులను ఎటువంటి అనుమతి లేకుండా బయటకు తీసుకొచ్చి పురాతన అవశేషాలకు ఎటువంటి ముప్పు కలిగించవద్దని, షాంపైన్‌ సీసాలు అద్భుతంగా సంరక్షించబడ్డాయి.. ఇవి 19వ శతాబ్దం చివరిలో నౌకాయాణం, జీవనశైలికి ప్రత్యక్ష సాక్ష్యం అని స్వీడన్‌ కౌంటీ అధికారి మాగ్నస్‌ జోహన్సన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘శిథిలాల సాంస్కృతిక, చారిత్రక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని తెలిపారు. అందుకే దీనిని పురాతన అవశేషంగా ప్రకటించాలని మరో అధికారి వ్యాఖ్యానించారు.

ఎవరిదీ ఓడ..
ఇదిలా ఉంటే.. సముద్రంలో గుర్తించిన ఓడ ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది. స్టాక్‌హోంలోని రాజ కుటుంబానికి లేదా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్‌ జార్‌ చక్రవర్తికి ఈ మద్యం తరలిస్తుండగా ఓడ మునిగిపోయి ఉండొచ్చని థామస్‌ స్టాచురా అనే స్కూబా డైవర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ శిథిలమైన నౌక సముద్రం అడుగున 58 మీటర్ల లోతులో ఉందని వెల్లడించారు. అందులోని వైన్, మినరల్‌ వాటర్‌ను బయటకు తీసుకొచ్చి.. ల్యాబ్‌లో పరీక్షించేందుకు డైవర్లను నిపుణులు సంప్రదిస్తున్నారని వెల్లడించాడు.

2016లోనే ఓడ గుర్తింపు..
దాదాపు 170 నుంచి 180 ఏళ్ల కిందట సముద్రంలో మునిగిపోయిన ఈ ఓడను 2016లోనే గుర్తించారు. అయితే, ఇందులో ఏం ఉన్నాయి అనేది మాత్రం గత నెలలోనే వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ నౌకలో స్వీడన్‌ లేదా రష్యా జార్‌ చక్రవర్తి కోసం అప్పుడెప్పుడో సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీనిని 1850 ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్నారు.