Homeక్రైమ్‌Crime News : ప్రేమించుకున్నారు.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. శోభనం రోజు అరుపులు, కేకలు.....

Crime News : ప్రేమించుకున్నారు.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. శోభనం రోజు అరుపులు, కేకలు.. ఊహించని ఘటన తో అంతా షాక్

Crime News: ప్రేమంటే.. ఒక వ్యక్తిని తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా అంగీకరించడం.. పెళ్లంటే ఆ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్ళడం. వెనుకటి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు అంతగా ఉండేవి కావు. అప్పట్లో ఒక అమ్మాయిని అబ్బాయి లేదా ఒక అబ్బాయిని అమ్మాయి ఇష్టపడినా బయటికి చెప్పేవారు కాదు.. నూటికి ఒక్కరో ఇద్దరో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు.. అయితే ఇందులో తమ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లినవారు చాలా తక్కువ మంది. అయినప్పటికీ వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖవంతంగా మార్చుకున్నారు. తర్వాత తరానికి ఆదర్శంగా నిలిచారు. తమ ప్రేమను కడదాకా కొనసాగించారు.. అన్యోన్యం అనే పదానికి సిసలైన అర్థం గా నిలిచారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ కూడా అనేక మార్పులకు గురవుతోంది..ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మర్చిపోవడం అనే తీరుగా మారింది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ తరంలో ప్రేమ అనేది నిలబడలేక పోతోంది. పైగా అది ఒక ఇన్స్టంట్ కుకీ అయిపోయింది. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ వంటివి కామన్ అయిపోవడంతో.. ప్రేమ అనే పదానికి అర్థం మారిపోయింది.. అసలు స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. అయితే కొందరు మాత్రం ప్రేమకు అసలైన అర్థం ఇచ్చేలాగా నడుచుకుంటున్నారు. ప్రేమించుకున్న తర్వాత.. తమ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్లేందుకు పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి.. అందరి సమక్షంలో వివాహం చేసుకొని.. ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరేమో పెద్దలకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో కొంతమంది కొంతకాలానికి తన బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎవరూ ఊహించని ఘటనకు పాల్పడింది. దీంతో వారిద్దరి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.. ఆ షాక్ వారు ఇంకా తేరుకోలేదు.

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చంబరసన హళ్లి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చెందిన నవీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైనపల్లి ప్రాంతానికి చెందిన లిఖితశ్రీ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పెద్దల సమక్షంలో బుధవారం వివాహం చేసుకున్నారు.. పెళ్లి వేడుకను ఇరు కుటుంబాల వారు ఘనంగా జరిపించారు. బంధువులను మిత్రులను ఆహ్వానించి ఘనంగా విందు కూడా ఇచ్చారు. పెళ్లి అనంతరం వారి సాంప్రదాయం ప్రకారం వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ముందుగా నవీన్ గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత లిఖిత శ్రీ పాల గ్లాసులో అందులోకి ప్రవేశించింది. బయట వాతావరణం చాలా సందడిగా ఉంది. బంధుమిత్రులు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు గాని నవీన్, లిఖిత శ్రీ ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఇద్దరు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆ ఘటన చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం వారిద్దరిని ఆ ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో, నవీన్, లిఖిత శ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అటు ఏపీ, ఇటు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు వారిద్దరు పొడుచుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. దీనిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇరు కుటుంబాల సభ్యులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version