Nostradamus: 2024లో ప్రకృతి విపరీత్యాలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు, భూకంపాల వంటివి వచ్చాయి. మన దేశం పరంగా చూసుకుంటే విస్తారంగా వర్షాలు కురిసాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు మునిగిపోయాయి. హిమాలయ పర్వతాల సరిహద్దును ఉన్న రాష్ట్రాలు వరద ముప్పును విపరీతంగా ఎదుర్కొన్నాయి. ఇక ప్రపంచపరంగా చూసుకుంటే నేపాల్ దేశం వరదలను చవిచూసింది. అమెరికా హిమపాతాన్ని ఎదుర్కొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఆసియాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సిరియా దేశంలో ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. దానికంటే ముందు శ్రీలంక, బంగ్లాదేశ్ లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఫలితంగా అక్కడి ప్రభుత్వ అధినేతలు తమ అధికారాన్ని కోల్పోయారు. దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఇజ్రాయిల్ – పాలస్తీనా, ఇరాక్ మధ్య భీకరమైన యుద్ధం సాగింది. ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది.
2025 లో ఎలా ఉందంటే..
మరి కొద్ది రోజుల్లో 2025 మొదలుకానంది. సహజంగానే కొత్త సంవత్సరం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడంటే మన చేతిలో సాంకేతికత ఉంది.. పంచాంగం, వాస్తు, భవిష్యవాణి వంటివి అందుబాటులో ఉన్నాయి. కానీ సరిగ్గా వందల సంవత్సరాల క్రితమే ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ సరికొత్త విషయాలను విశ్లేషించాడు. ఈ ప్రకారం 2025లో అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందట. లేదా దగ్గరగా వస్తుందట.. దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధాలు ముగుస్తాయట. అంటే ఈ ప్రకారం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ తమ యుద్ధాలకు ముగింపు పలుకుతాయి కావచ్చు. అమెరికాకు దగ్గరలో ఉండే బ్రెజిల్ దేశంలో విపరీతమైన వరదలు వస్తాయట. అగ్నిపర్వతాలు కూడా బద్దలవుతాయట. అయితే కనుమరుగైన ప్లేగు వ్యాధి మళ్లీ తన ప్రతాపం చూపిస్తుందట.. అయితే వీటిని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. నవీన యుగంలో కాల్పానిక ఒక వ్యక్తుల గ్రంథాలకు విలువలేదని.. వారు చెప్పిన మాటలకు యదార్ధత అంతకన్నా లేదని అంటున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందించడానికి పనికి వస్తాయని చెబుతున్నారు. కనుమరుగైన ప్లేగు వ్యాధి ఇప్పుడు రావడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ” శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ప్రపంచం మనుగడను నిర్దేశిస్తున్నాయి. సరికొత్త ఉత్పత్తులు మనిషి జీవితాన్ని అత్యంత సుఖవంతం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరో ఏదో చెప్పారని అనుకోవడం భ్రమ. ముందుగా ఇలాంటి నమ్మకాలను పక్కన పెట్టాలి. కేవలం జరుగుతున్న యదార్ధాన్ని మాత్రమే నమ్మాలి. అప్పుడే ఎటువంటి అపోహలు లేని ప్రపంచంలో జీవించవచ్చు. సానుకూల దృక్పథాన్ని ఆస్వాదించవచ్చు. విశిష్టమైన ప్రపంచంలో మనుగడ కొనసాగించవచ్చని…” అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 2025 is going to be like this what did nostradamus say hundreds of years ago
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com