Pillow: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకి అయిన పెద్దవాళ్లకైనా సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. దీనికి తోడు నిద్రపోయేటప్పుుడు దిండులు, దుప్పటిల విషయంలో కూడా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా దిండు సరిగ్గా లేకపోతే అసలు నిద్రపట్టదు. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. అలాగే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. వీటితో పాటు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్ట నిద్రపోయేటప్పుడు హాయిగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొందరు తెలియక దిండు విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. మరి ఆ సమస్యలేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
దిండు మెత్తగా, సువాసనగా ఉంటేనే హాయిగా నిద్రపడుతుంది. లేకపోతే నిద్ర ఉండదు. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఏళ్ల తరబడి దిండులు వాడుతుంటారు. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అందులో బ్యాక్టీరియా ఉండిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. దిండులు కనీసం రెండేళ్లకు ఒకసారి మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దిండులను నెలకు ఒకసారి మంచిగా వాష్ చేయాలి. దిండుపై ఉండే బెడ్‌షీట్‌ను అయితే పదిహేను రోజులకి ఒకసారి వాష్ చేస్తుండాలి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు దిండు ముఖానికి తగులుతుంది. అందులోని బ్యాక్టీరియా వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దిండు బెడ్‌షీట్లను కనీసం 15 రోజులకు ఒకసారి అయిన క్లీన్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తల కింద దిండు పెట్టుకోకుండా నిద్రపోవడమే ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువ శాతం మంది దిండు లేకుండా నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే తల కింద దిండు వేసుకుని నిద్రపోయే వారు ఎక్కువ ఎత్తు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. తలకి కాస్త ఎత్తులోనే ఉండాలి. ఎక్కువ ఎత్తులో ఉంటే కండరాలు పట్టేస్తాయి. దీంతో వెన్నెముక నొప్పి, మెడ నొప్పి వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. దీనివల్ల కండరాలు బాగా నొప్పికి గురి కావడంతో ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ఫ్లాట్ ఉండే దిండును తలకింద పెట్టుకుని నిద్రపోండి. దీనివల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే తలనొప్పి వంటి సమస్యలు రావు. అలాగే దిండు కూడా గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు ఏదో గట్టిగా కాకుండా మెత్తగా అనిపించి హాయిగా నిద్రపోతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.