Nostradamus And Baba Vanga: ఫ్రాన్స్ తత్వవేత్త నోస్ట్రడామస్, బల్గేరియా జ్యోతిష్యురాలు వంగబాబా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వీరిద్దరూ ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఈ ప్రపంచం మాత్రం వారి అంచనాలపై లోతుగా చర్చిస్తూ ప్రతి సంవత్సరం ముందుకు సాగుతుంది. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి ఆ సంవత్సరానికి సంబంధించి వారిద్దరూ ఏం చెప్పారు అనే దానిపై చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం 2025 కు సంబంధించి వారిద్దరూ ఏం చెప్పారు అని దానిపై ప్రచారం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోస్ట్రడామస్ 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన 2025లో భారీ యుద్ధాలు జరుగుతాయని అలాగే ఆ యుద్ధంలో శక్తివంతమైన దేశాలు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈయన 2025లో ప్రజలు టెక్నాలజీని తప్పుగా వాడుకుంటారని, దాని కారణంగా పర్యావరణ విపత్తులు వస్తాయని, సైబర్ యుద్ధాలు, టెక్నాలజీ మోసాలు జరుగుతాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం 2025 చాలా దేశాల్లో రాజకీయంగా అనిశ్చితి ఉండి కూటములుగా ఉండే ప్రపంచ దేశాల మధ్య చిచ్చు ఏర్పడుతుందని ఆయన అంచనా వేసినట్లు సమాచారం. ఇక వంగ బాబా అంచనాల విషయానికి వస్తే ప్రపంచంలో సమూల మార్పులు వస్తాయని, అలాగే మిత్రదేశాలు శత్రువులుగా మారడం, మిత్ర దేశాలు కలవడం వంటివి జరుగుతాయని అంచనా వేశారు. 2025లో బయోలాజికల్ వెపన్స్, అనుబాంబులతో జాగ్రత్తగా ఉండాలని, అవి ఎక్కువమంది ప్రజలను ప్రభావితం చేస్తాయని వంగ బాబా అంచనా వేశారు.
విశ్వంలో ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతాయని, గ్రహాంతరవాసుల్ని కనుగొనే అవకాశం కూడా ఉందని వంగ బాబా అంచనా వేసినట్టు సమాచారం. 2025 లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని నోస్ట్రడామస్ గాని వంగ బాబా గాని డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ వారిద్దరి అంచనాలను బాగా గమనిస్తే ఈ సంవత్సరం పెద్ద దేశాలైన అమెరికా, రష్యా, చైనా వంటివి భారీ యుద్ధాలకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తుంది. అలాగే దేశాల మధ్య శత్రుత్వాలు, మిత్రుత్వలా సమస్యలు పెరిగి ప్రపంచం అంతటా అనిశ్చితి ఉండవచ్చు అనే అంచనాలు కనిపిస్తున్నాయి. వీటిని నమ్మొచ్చా లేదా అంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే.
అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఎవరైనా ఒక 100 అంచనాలు వేస్తే అందులో కేవలం 10 మాత్రమే నిజం అవుతాయి. ఇలాంటివి ఎవరైనా చెప్పగలరు. కానీ చాలావరకు వీరిద్దరూ చెప్పిన అంచనాలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం గురించి వారిద్దరూ ఏం అంచనా వేశారు అనే దాని గురించి ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారిద్దరూ 2025 గురించి ఇవన్నీ చెప్పారు అనడానికి ఆధారాలు మాత్రం లేవు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం జరుగుతుంది. అయితే వీటిని నమ్మే వాళ్ళు కొందరు ఉంటే కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: According to the prediction of nostradamus and baba vanga will the third world war happen in 2025 shocking things said by both of them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com