spot_img
Homeబిజినెస్Credit card : యూత్ ఎక్కువగా వాడుతున్న క్రెడిట్ కార్డు ఇదే.. దీని లాభాలు చూస్తే...

Credit card : యూత్ ఎక్కువగా వాడుతున్న క్రెడిట్ కార్డు ఇదే.. దీని లాభాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Credit card : మోడీ 1.0లో బ్యాంకుల లింకేజీ వేగవంతం చేశారు. ఆ తర్వాత బ్యాంకులు సాధారణ కష్టమర్ల కోసం విరివిగా క్రెడిట్ కార్డులను జారీ చేయడం ప్రారంభించాయి. ఎంతలా అంటే చిరు వ్యాపారం ఉన్నా, తక్కువ సాలరీతో ఉన్నా వివిధ బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తామని క్యూ కడుతున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు రూపే కార్డులను ఇస్తున్నాయి. వీటితో రోజు వారి అవసరాలను, రోజు వారి ఖర్చులు పెట్టుకోవచ్చు. ఇక వచ్చిన బిల్లును నెల నుంచి 45 రోజుల తర్వాత కట్టుకోవచ్చు. వీటిపై ఎలాంటి అదనపు ఛార్జీలను బ్యాంకులు విధించడం లేదు. దీంతో మార్కెట్లో డబ్బు పరవాహం పెరిగి దేశ ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆయా బ్యాంకులు ఇచ్చే కార్డులు కొన్ని కొన్నింటికీ పని చేస్తాయి. కొన్ని కార్డులు షాపింగ్ పర్పస్, మరికొన్ని ఫ్యూయల్ పర్పస్, ఇంకొన్ని ఫుడ్ అండ్ రెస్టారెంట్ పర్పస్ ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు ఉపయోగపడుతుంది. ఇదంతా పక్కన పెడితే యాక్సిస్ బ్యాంకు జారీ చేసే ‘నియో’ కార్డు చాలా ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇది ముఖ్యంగా యూత్ కోసం తీసుకువచ్చినట్లు బ్యాంకు స్పష్టం చేసింది. మరి దీనితో ప్రయోజనాలను చూద్దామా…

షాపింగ్ చేసేందుకు, ఫుడ్ తినేందుకు ఇష్టపడే వారికి యాక్సిస్ బ్యాంక్ వారి అవసరాలకు సరిపోయే ఎంట్రీ-లెవల్ క్రెడిట్ కార్డు యాక్సిస్ నియో. ఇది షాపింగ్‌పై వివిధ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. మిలీనియల్స్ కోసం ఉత్తమ క్రెడిట్ కార్డులో ఇది ఒకటి. మీ ఖర్చులన్నింటిపై సాధారణ ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లు కాకుండా, జొమాటో, మింత్రా, పేటీఎం సహా భాగస్వామి బ్రాండ్‌లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తుంది. ఈ కార్డ్‌తో సినిమాల టికెట్ ను BookMyShowతో బుక్ చేసుకుంటే 10% తగ్గింపును పొందవచ్చు. ఫుడ్ డెలివరిపై 40 శాతం తగ్గింపు వస్తుంది.

స్వాగతం ప్రయోజనాలు
యుటిలిటీ బిల్లు చెల్లింపుపై ₹300 వరకు 100% క్యాష్‌ బ్యాక్. కార్డ్ సెటప్ తేదీ నుంచి మొదటి 30 రోజుల్లోపు వారి మొదటి లావాదేవీ ద్వారా కార్డ్ హోల్డర్‌లు ఈ స్వాగత ప్రయోజనాల ప్రయోజనాన్ని పొందవచ్చు. కార్డుకు సంబంధించి పార్టనర్ రెస్టారెంట్లలో మీరు భోజనం చేస్తే 15% తగ్గింపు పొందుతారు. Zomato నుంచి నెలకు 2 సార్లు ₹200 అంతకంటే ఎక్కువ విలువైన ఆహారంపై 40% తగ్గింపు అందిస్తుంది. ఒక్కో ఆర్డర్‌పై గరిష్ట తగ్గింపు ₹120. డిస్కౌంట్ పొందేందుకు యాక్సిస్ నియో కూపన్ కోడ్‌ ఉపయోగించాలి.

పేటీఎంతో యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 5% తగ్గింపు వర్తిస్తుంది. పేటీఎంతో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ రీఛార్జి చేస్తే 5% తగ్గింపు పొందుతారు. ఇది నెలకు ఒకసారి పని చేస్తుంది. ప్రతీ నెల Blinkitపై ₹750 ఖర్చు చేస్తే 10% తగ్గింపు (రూ.250 వరకు) పొందుతారు. Myntraలో ₹999 షాపింగ్‌పై ₹150 తగ్గింపు పొందవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES
spot_img

Most Popular