NTR-Krishna Kumari
NTR-Krishna Kumari: ఎన్టీ రామారావును ఆంధ్రులు ఎంతలా కొలుస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుపతికి వెళ్లిన వారు రామారావును చూడకుండా వస్తే.. పూర్తి దర్శనం కానట్టే అని అప్పట్లో ప్రచారం జరిగేది. అంటే ఆయన్ను అంతలా అభిమానించే వారు అభిమానులు. అయితే అందరికీ తెలిసినంత వరకు ఎన్టీఆర్‌కు రెండో పెండ్లి లక్ష్మీ పార్వతితో అయింది అనుకుంటారు. కానీ ఈమె కంటే ముందు రామారావు మరో అమ్మాయిని రెండో పెండ్లి చేసుకోవాలి అనుకున్నారంట.
NTR-Lakshmi Parvathi
అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల పరంగా స్టార్ స్టేటస్ లో ఉన్నప్పుడే.. హీరోయిన్ లు ఆయనకు కాల్ షీట్లు ఇచ్చే వారు కాదంట. వాస్తవానికి చాలామంది హీరోయిన్లను ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చి ప్రమోట్ చేసింది ఎన్టీఆర్. అయినా కూడా ఎన్టీఆర్ హీరోయిన్లందర్నీ ఏఎన్నార్ సంవత్సరాల కొద్దీ కాల్ షీట్లు తీసుకునేవాడంట. ఈ కారణంగా ఎన్టీఆర్ కు హీరోయిన్ల కొరత ఏర్పడేది. దీంతో ఆయన కృష్ణ కుమారి అనే హీరోయిన్ను తీసుకు వచ్చారు.
NTR-Krishna Kumari
ఆమె చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేదంట. ఎన్టీఆర్ ఎక్కువగా ఆమెతోనే సినిమాలు చేసేవారంట. ఈమె కేవలం ఎన్టీఆర్తోనే ఎక్కువగా నటించేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. ఆమె గుణగణాలు ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో పెండ్లి చేసుకోవాలని అనుకున్నారంట. అప్పటికే ఆయన భార్య బసవతారకం బాలింతగా ఉన్నారు. దీంతో మెంటల్ ప్రెజర్‌ను తగ్గించుకునేందుకు ఆయన కృష్ణకుమారితో సహజీవనం చేయాలనుకున్నారంట.
Actress Krishna Kumari
ఈ విషయం బసవతారకంకు తెలియడంతో.. ఆమె కూడా అడ్డు చెప్పలేదంట. ఇక కృష్ణ కుమారి కూడా ఇష్టపూర్వకంగా ఒప్పుకోవడంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన చిన్నాయనకు చెప్పారు. వేడుకకు రావాలంటూ కబురు పంపారు. దీంతో విజయవాడలో ఉంటున్న చిన్నాయన త్రివిక్రమ రావు ఎన్టీఆర్‌కు తాను వచ్చే వారకు ఏమీ చేయొద్దని చెప్పారంట.
Also Read: లెజెండరీ డైరెక్టర్ కి మెగా శుభాకాంక్షలు – చిరంజీవి
నేరుగా బైక్ వేసుకుని కృష్ణ కుమారి ఇంటికి వెళ్లారంట. నిత్యం ఆయన తన వెంట పెట్టుకునే తుపాకీతో ఆమెను బెదిరించారు. ఆంధ్రులు రాముడిలా భావించే ఎన్టీఆర్‌తో రెండో పెండ్లి అంటే అందరూ ఏమనుకుంటారని ప్రశ్నించారు. కాబట్టి ఆయన కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించడంతో.. ఆమె భయపడిపోయి బెంగుళూరు వెళ్లిపోయిందంట.
ఇక ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన చిన్నాయన.. ఇప్పటికే 11 మంది పిల్లలు ఉన్న నీకు మళ్లీ పెండ్లి ఏంటి అని సర్ది చెప్పారు. కానీ కృష్ణ కుమారి ఏమనుకుంటుందో అని ఎన్టీఆర్ బాధ పడ్డారంట. తాను ఇక్కడ లేదని చిన్నాయన చెప్పడంతో.. ఆ పెండ్లి కాస్త అక్కడితో ఆగిపోయింది.
Also Read: జనాలకు ఫ్రీగా హగ్గులు ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. అసలు కారణం ఇదే..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Ntr wanted to marry krishna kumari befor marrying lakshmi parvathi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com