- Telugu News » Ap » Why do you object to anandayya medicine chinjiyar swamy
ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు..?
నెల్లురు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ర్పభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు అన్నారు. సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు అని చెప్పారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం […]
Written By:
, Updated On : May 30, 2021 / 03:07 PM IST

నెల్లురు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ర్పభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు అన్నారు. సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు అని చెప్పారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని చినజీయర్ స్వామీ అన్నారు.