Homeప్రవాస భారతీయులుTANA: ప్రవాస విద్యార్థుల కోసం ‘‘తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌’’

TANA: ప్రవాస విద్యార్థుల కోసం ‘‘తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌’’

TANA: తెలుగు వారి కోసం అమెరికాలోని తానా(తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోని తెలుగువారి ఐక్యతను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా అమెరికాకు వస్తున అంతర్జాతీయ విద్యార్థుల కోసం ‘‘తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌’’ పేరిట అవగాహన తరగతులను ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణప్రసాద్‌ తెలిపారు.

తరగతులు ఎక్కండంటే..
ఇక తానా నిర్వహించే రిఫ్రెష్‌ ప్రోగ్రామ్‌ తరగతులను విద్యాలయాల్లోనే నిర్వహించనున్నారు. ఈ తరగతుల్లో అంతర్జాతీయ విద్యార్థుల ఓరియంటేషన్‌ ఆవశ్యకత, పెప్పర్‌స్ప్రే వినియోగం, సామాజిక బాధ్యత, స్థానిక చట్టాలు, స్వీయ భద్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ ‘‘తానా రిఫ్రెష్‌ ప్రోగ్రామ్‌’’ అంతర్జాతీయ విద్యార్థుల మైండ్‌ సెట్‌ను రిఫ్రెష్‌ చేస్తుందని తానా ప్రతినిధులు తెలిపారు. తద్వారా ప్రమాదాలను, దుర్ఘటనలను కొంతమేర తగ్గించవచ్చని తానా ప్రతినిధి సోంపల్లి కృష్ణప్రసాద్‌ తెలిపారు.

ఈ నంబర్‌లో సంప్రదించాలి..
ఇక తానా రిఫ్రెస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటున్న వారికీ వీలైనంత వరకు సమాచారం అందిస్తున్నారు. ఇంకా సమచారం అందని వారు ఉంటే 724–726–1166 నంబర్ లో సంప్రదించాలని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ తరగతుల ద్వారా భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనడానికి సహాయ పడతాయని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular