Busiest Airport: ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితా(2023) ఇటీవల విడుదలైంది. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉంది. ప్రయాణికుల సంఖ్యాపరంగా తొలి పది స్థానాల్లో ఉన్న ఎయిర్ పోర్టులు ఇవీ.
= హార్ట్స్‌ఫీల్డ్–జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి గతేడాది 10.46 కోట్ల మంది ప్రయాణం చేశారు.
= రెండో స్థానంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి గతేడాది(2023లో) 8.96 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు.
= డాలస్ ఫోర్త్ ఎర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో మూడో స్థానంలో నిలిచింది. 2023లో ఇక్కడి నుంచి విమానాల ద్వారా 8.17 కోట్ల మంది ప్రయాణించారు.
= లండన్ హీత్రో విమానాశ్రయం.. ఇది రద్దీ అయిన విమానాశ్రయాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2023 సంవత్సరంలో 7.92 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు.
= టోక్కో హోనెడా విమానాశ్రయం.. రద్దీ విమానాశ్రయాల్లో 5వ స్థానం దక్కించుకుంది. ఇక్కడి నుంచి గతేడాది(2023లో) 7.87 కోట్ల మంది విమానాల్లో వివిధ దేశాలకు రాకపోకలు సాగించారు.
= డెన్వర్ విమానాశ్రయం.. ఇది రద్దీ విమానాశ్రయాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2023లో 7.78 కోట్ల మంది వివిధ దేశాలకు విమానాల్లో ప్రయాణించారు.
= ఇస్తాంబుల్ విమానాశ్రయం.. ప్రపంచంలోని రద్దీ విమానాశ్రయాల జాబితాలో ఇస్తాబుల్ ఎయిర్ పోర్టుకు 7వ స్థానం దక్కింది. ఇక్కడి నుంచి గతేడాది 7.6 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు.
= అమెరికాలోని లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది. ఇక్కడి నుంచి గతేడాది 7.5 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
= అమెరికాకే చెందిన షికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీ విమానాశ్రయాల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 7.4 కోట్ల మంది ప్రయాణికులు 2023లో రాకపోకలు సాగించారు.
= భారత్ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. 2023లో ఈ విమానాశ్రయం నుంచి 7.22 కోట్ల మంది రాకపోకలు సాగించారు.