Road Accident: హైదరాబాద్‌లో అతిగా మద్యం సేవించి బెంజ్ కారు నడుపుతూ.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ఎన్‌ఆర్‌ఐకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే కారులో ప్రయాణిస్తున్న మిగతా నలుగురు విదేశీయులకు వెయిల్ మంజూరు చేశారు.
ఏం జరిగిందంటే..
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉంటున్న అవినాష్ అనే ఎన్‌ఆర్‌ఐ తన సోదరుడి వివాహానికి ఏప్రిల్ 20న అమెరికా, జర్మనీలోని నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. వారు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేశారు. మంగళవారం రాత్రి వీరు బంజారాహిల్స్ కారా పబ్‌లో మద్యం సేవించి బుధవారం తెల్లవారుజామున బెంజ్‌కారులు పార్క్ హయత్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది.
ఐదుగురిపై కేసు..
ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పోలీసులు కారు నడిపిన అమెరికాలో నివసించే టార్గెట్ సెక్యూరిటీ సీఈవో ఈతెన్ వెంకటేశ్, కారులో ఉన్న ఎన్‌ఆర్‌ఐ అవినాష్ చలసాని, దుబాయ్‌కు చెందిన సాషా, జర్మనీకి చెందిన మ్యాక్‌మిలన్ హెన్రీ రాడింగర్, అమెరికాలో ఉంటున్న సాయిప్రియతమ్ కాశంపై కేసు నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్‌కు తిరస్కరించి గురువారం తీసుకురావాలని ఆదేశించింది.
రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్..
గురువారం 17వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నిందితులను హాజరు పరాచరు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రధాన నిందితుడు వెంకటేశ్‌కు రెండు వారాల రిమాండ్ విధించారు. మిగతా వారికి బెయిల్ మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలోనే వీరికి డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. వెంకటేశ్‌కు 360 బీఏసీ (బ్లడ్ ఆల్కాహల్ కంటెంట్)గా నమోదైంది. మిగతా నలుగురు కూడా మద్యం తాగినట్లు నిర్ధారించారు.