https://oktelugu.com/

Money Earning: ఇంటర్నెట్ ఉంటే ఇల్లే ఆఫీస్.. లక్ష రూపాయల జీతం.. ఎలాగో తెలుసుకోండి..

నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పని సరిగా ఉంటుంది. అదీ స్మార్ట్ ఫోన్ అయి ఉంటుంది. దీంతో ఈ మొబైల్ తో విభిన్న వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2024 11:35 am
    money earning

    money earning

    Follow us on

    Money Earning: ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే పట్నం వెళ్లాల్సి వచ్చేది. కొన్ని నెలల పాటు కంపెనీల చుట్టూ తిరిగితే ఏదో చిన్న ఉద్యోగం లభించేది. అనుభవం, తెలివి రకరకాల ప్రత్యేకలతో కొన్నేళ్ల తరువాత ప్రమోషన్లు వచ్చేవి. అప్పటికీ గానీ జీతం పెరిగేది కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు కొందరు కార్యాలయాన్ని నమ్ముకోవడం లేదు. ఏ కంపెనీ కోసం ఎదురుచూడడం లేదు. ఇంటర్నెట్ ను ఏర్పాటు చేసుకొని ఇంటినే కార్యాలయంగా మార్చుకుంటున్నారు. కాలు బయటపెట్టకుండా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అదెలాగో తెలుసకోండి..

    వీడియోలతో సంపాదన:
    నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పని సరిగా ఉంటుంది. అదీ స్మార్ట్ ఫోన్ అయి ఉంటుంది. దీంతో ఈ మొబైల్ తో విభిన్న వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.కొందరు దీనిని వృత్తిగా మార్చుకొని ప్రత్యేక కేటగిరీల వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుున్నారు.దీని కోసం ఇంట్లో ఇంటర్నెట్ ఓ కంప్యూటర్ ఉంటే చాలు. వాటి ద్వారా క్వాలిటీ వీడియోలో అప్లోడ్ చేసి లక్షల రూపాయలు సంపాదించేవారు ఉన్నారు.

    బ్లాగింగ్ ద్వారా..
    కొందరు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని చూస్తారు. ఒక కాలమ్ ను ఏర్పాటు చేసి బ్లాగ్ లను రాయొచ్చు. ఒకప్పుడు ఇవి సరదా కోసం రాసేవారు. కానీ ఇప్పుడు ఒక అంశాన్ని తీసుకొని అందులో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రముఖలుగా మారిన తరువాత కొన్ని సంస్థలు వారిని నియమించుకుంటున్నారు. వీరు బ్లాగులు రాయడానికి కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. ఇంట్లో నుంచే రాయొచ్చు.

    కంటెంట్ రైటర్స్:
    ప్రస్తుతం వెబ్ సైట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో స్టోరీలు రాసేందుకు కంటెంట్ రైటర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక కేటగిరిలో పట్టు ఉంటే వాటిలో మంచి స్టోరీ రాయగలిగితే మంచి సంపాదన ఉంటుంది. కొందరు ఈ వెబ్ సైట్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు.