Central Govt Schemes: భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలో చాలా బూభాగం వ్యవసాయంతో నిండి ఉన్నందున రైతులు ఈ రంగంపైనే ఎక్కువగా ఆధారపడుతారు. అయితే రైతులు నష్టపోయిన సందర్భంలో అవసరమైన ఆహార పదార్థాలు మార్కెట్లోకి రావు. దీంతో ఆహార కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. అందువల్ల రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు వివిధ పథకాలు ప్రవేశ పెడుతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులకు అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటి గురించి వివరాల్లోకి వెళితే…
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరిట ఉన్న ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది. ఏడాది పాటు రూ.6000 ఇస్తుంది. ఇవి ప్రతీ క్రాప్ సమయంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 చొప్పున యాడ్ అవుతాయి. చాలా మంది రైతులు పెట్టుబడుల సమయంలో సమయానికి డబ్బు అందదు. దీంతో అప్పులు చేసి పంటలు వేస్తారు. ఒకవేళ పంట నష్టపోతే అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2023 డిసెంబర్ వరకు 107 మిలియన్ల మంది ఈ పథకాన్ని లబ్ధి పొందారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే మరో పథకం ప్రధానమంత్రి పసల్ బీమా యోజన.రైతులు ఎంతో ఆశతో తీవ్రంగా శ్రమించి పంటలు వేస్తారు. కానీ ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతారు. అలాగే తెగుళ్లు, తదితర కారణాలతో పంటలు దెబ్బతింటాయి. ఇలాంటి సమయంలో రైతులకు తోడుగా ఉండేందుకు ఈ పథకం ద్వారా సాయం చేస్తారు. అయితే ముందుగా ఇందులో పేరు నమోదు చేసుకుంటే ఆ ఏడాదిలో నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు. కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి.
రైతుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. దీనినే కిసాన్ క్రెడిట్ కార్డు అంటారు. 1998లో దీనిని ప్రారంభించారు. రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎరువు, విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. కొన్ని రోజుల వ్యవధితో వడ్డీ లేకుండా దీని ద్వారా నగదు సాయం చేస్తారు. ఖర్చులు మాత్రమే కాకుండా రైతులు క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు కూడా తీసుకోవచ్చు. వీటిపై 4 శాతం వడ్డీ రాయితీ అందిస్తున్నారు.