https://oktelugu.com/

కౌశ‌ల్ భార్య పోస్టు వైర‌ల్ః ఇండియా గురించి అలా..

బిగ్ బాస్ – 2 సీజ‌న్ విజేత కౌశ‌ల్ భార్య టాపిక్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రితం త‌న భార్య ఆరోగ్యం గురించి కౌశ‌ల్ ఓ పోస్టు పెట్టారు. ‘‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు. ఏదో ఒక‌టి సాధిస్తావ‌ని తెలుసు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నా. ల‌వ్ యూ, మిస్ యూ నీలిమ’’ అంటూ వరుస పోస్టులు చేశారు కౌశల్. దీంతో.. ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది. కౌశ‌ల్ స‌తీమ‌ణికి […]

Written By:
  • Rocky
  • , Updated On : June 4, 2021 / 11:54 AM IST
    Follow us on

    బిగ్ బాస్ – 2 సీజ‌న్ విజేత కౌశ‌ల్ భార్య టాపిక్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రితం త‌న భార్య ఆరోగ్యం గురించి కౌశ‌ల్ ఓ పోస్టు పెట్టారు. ‘‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు. ఏదో ఒక‌టి సాధిస్తావ‌ని తెలుసు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నా. ల‌వ్ యూ, మిస్ యూ నీలిమ’’ అంటూ వరుస పోస్టులు చేశారు కౌశల్.

    దీంతో.. ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది. కౌశ‌ల్ స‌తీమ‌ణికి ఏదో అయ్యింద‌ని, అది ఏమై ఉంటుంద‌ని జోరుగా చ‌ర్చ సాగింది. ఈ నేప‌థ్యంలో నీలిమ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను విడుద‌ల చేశారు. దీంతో.. ఆమె ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తంచేసిన వారందరికీ స‌మాధానం దొరికింది. ఇంత‌కీ.. ఆ వీడియోలో నీలిమ ఏమ‌న్నారంటే..

    ‘‘నేను లండన్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఏడు రోజుల క్రితం నాకు క‌రోనా సోకింది. ఇండియాలో చాలా దారుణ‌మైన, భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అనుకుంటారు. కానీ.. ఇక్క‌డే ఘోరంగా ఉంది. కొవిడ్ బారిన ప‌డిన నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతిలో నొప్పితోపాటు ఆయాసం కూడా వ‌చ్చింది. నా పరిస్థితి బాగోలేదని వైద్యులకు చెబితే.. వారు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారు.’’అని ఆవేదన వ్యక్తం చేశారామె.

    ఇంకా కొనసాగిస్తూ… ‘‘కరోనా లక్షణాలు అలాగే ఉంటాయ‌ని, వాటిని ఎదుర్కోవాల‌ని నాకు ఉచిత స‌ల‌హా ఇచ్చారు. యూకేలో ట్రీట్మెంట్ గొప్ప‌గా ఉంటుంద‌న‌కున్నా. కానీ.. నా అనుభ‌వం అందుకు విరుద్ధంగా ఉంది. నా జీవితంలో ఇది నిజంగా ఓ చేదు అనుభ‌వం. ఇదే మ‌న‌దేశంలో అయితే వెంట‌నే వైద్యం అందిస్తారు. ఇక్క‌డ అలా కాదు. నాకు చాలా భ‌య‌మేసింది. ఇండియాలోనే క‌రోనాకు మంచి వైద్యం అందిస్తారు కాబ‌ట్టి మీరెవ‌రూ భ‌య‌ప‌డొద్దు. మీ అంద‌రి ప్రార్థ‌న‌ల వ‌ల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వ‌ర‌లోనే భారత్ తిరిగి వ‌స్తాను’’ అని చెప్పుకొచ్చిందామె.