బీజేపీలోకి ఈటల? సంజయ్ కు చెక్ పెట్టడానికేనా?

భారతీయ జనతా పార్టీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినా తరువాత జరిగిన నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందింది. దీంతో పార్టీలో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈమేరకు పలుచర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రానున్నారు. ఈటలకు ఇచ్చిన హామీల మేరకు ఆయన పార్టీలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 1:16 pm
Follow us on

భారతీయ జనతా పార్టీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినా తరువాత జరిగిన నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందింది. దీంతో పార్టీలో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈమేరకు పలుచర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రానున్నారు. ఈటలకు ఇచ్చిన హామీల మేరకు ఆయన పార్టీలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తోంది. దీని వెనుక పెద్ద కథే జరిగిందని చెబుతున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కు చెక్ పెట్టడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఈటల రాకకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని వినికిడి.

దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాక బండి సంజయ్ స్థాయి పెరిగింది. నేరుగా ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందించారు. తర్వాత జరిగిన నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అపజయం మూటగట్టుకుంది. దీంతో సంజయ్ వ్యతిరేక గ్రూపు తయారయింది. ఆయన దూకుడు తగ్గించాలని భావిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన వర్గీయులకే పనులు అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో బండి సంజయ్ వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈటల ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన వెంట వివేక్ ఉన్నారు. కానీ బండి సంజయ్ కి విషయం కూడా తెలియదంటే ఎంత వివక్షో తెలుస్తుంది కదా. సంజయ్ ప్రాధాన్యం తగ్గించడానికే ఈటలను పార్టీలోకి తీసుకువస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈటల వర్సెస్ సంజయ్ అనే విధంగా రాజకీయాలు మారతాయని విశ్లేషకులు చెబుతున్నారు.