https://oktelugu.com/

America: అమెరికాలో భారతీయ మృగాడు.. వైద్య వృత్తిలో కీచకపర్వం.. భార్య ఫిర్యాదుతో అరెస్ట్‌.. !

ఇక్కడ... అక్కడ అని తేడాలేదు. మహిళలపై అఘాయిత్యాలు చేయడానికి దేశ భాషలతో సంబంధం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆడది కనిపిస్తే పశువుల్లా ప్రవర్తించే మృగాళ్లు అంతటా ఉంటున్నారు .

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 22, 2024 / 10:27 AM IST

    America

    Follow us on

    America: అగ్రరాజ్యం అమెరికాకు భారతీయులు విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. చాలా మంది అక్కడే స్థిరపడేందుకు గ్రీన్‌ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికాలో ఏ పొరపాటు చేసినా తప్పించుకోలేరు.. కానీ, కొంత మంది భారతీయులు అక్కడ కూడా తమ తెలివితే నేరాలు చేస్తున్నారు. కానీ, కాస్త ఆలస్యంగా అయినా పట్టుపడుతున్నారు. ఊచలు లెక్కిస్తున్నారు. ఇటీవలో హెచ్‌–1బీ వీసా స్కాం జరిగినట్లు గుర్తించిన అమెరికా నిఘా విభాగం.. ఇందులో భారతీయులు కీలకపాత్ర పోషించినట్లు నిర్ధారించింది. తాజాగా ఓ భారతీయ వైద్య మృగాడినీ అరెస్టు చేశారు అమెరికా పోలీసులు. సదరు వైద్యుడు కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు రికార్డు చేశాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు.

    ఏం జరిగిందంటే..
    భారత్‌కు ఎందిన ఓయిమెయిర్‌ ఎజాజ్‌ 2011లో వర్క్‌ వీసాపై అమెరికా వెళ్లాడు. తొలుత కొన్నేళ్లు అలబామాలో నివాసమున్నాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆస్పత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా సదరు వైద్యుడు లైంగిక దారుణాలకు పాల్పడుతున్నాడు. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూలు, చేజింగ్‌ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్‌ చేశాడు.

    భార్య ఫిర్యాదుతో అరెస్ట్‌..
    మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను ఓయిమెయిర్‌ ఎజాజ్‌ రికార్డ్‌ చేసేవాడు. ఆస్పత్రుల్లో పేషెంట్లను కూడా లైంగిక వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అతడి భార్యకు ఈ విషయం తెలియడంతో ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేసింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

    ఫోన్లు, కంప్యూటర్లలో వేలాది వీడియోలు..
    అతడి నివాసంలో ఓ కంప్యూటర్, ఫోన్లు, 15 ఎక్స్‌ టర్నల్‌ స్టోరేజీ డివైజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక సింగిల్‌ హార్డ్‌ డ్రైవ్లో 13 వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్‌ స్టోరేజ్లోనూ ఈ దృశ్యాలను అప్లోడ్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిపై నేరాభియోగాలు మోపి జైలుకు పంపించారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.