Sukumar: సుకుమార్ తో పోలిస్తే ఈ కమర్షియల్ డైరెక్టర్లు వెనకబడి పోవడానికి కారణం ఏంటంటే..?

కమర్షియల్ సినిమాలని కూడా చాలా కొత్తగా తీసి సక్సెస్ లను అందుకునే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు అందులో సుకుమార్ ఒకరు.. ప్రయోగాత్మకమైన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తూ సక్సెస్ లను సాధించడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు...

Written By: Gopi, Updated On : August 22, 2024 10:31 am

Sukumar

Follow us on

Sukumar: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలామంది దర్శకులు ఫేడౌట్ దశకి దగ్గర్లో ఉన్నారనే విషయం ఇప్పుడిప్పుడే స్పష్టం అవుతుంది. రీసెంట్ గా హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం చేసిన సినిమాలు ఏ మాత్రం మ్యాజిక్ ని క్రియేట్ చేయకుండా భారీ డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి హవా తగ్గుతుందనే చెప్పాలి. అయితే కమర్షియల్ డైరెక్టర్ల హవా తగ్గిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళ దగ్గర వర్క్ చేసే టీమ్ ని కూడా సరిగ్గా చూసుకోవడం లేదు. అందువల్లే వాళ్ల దగ్గర బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే టీమ్ పని చేయలేక పోతుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.

ఇక ఆయన ఎప్పటికప్పుడు యంగ్ టీమ్ ని తీసుకొని వాళ్ల దగ్గర ఉన్న ఫ్రెష్ థాట్స్ తో తన థాట్స్ ని మిక్స్ చేసి అవుట్ ఫుట్ ని ఇవ్వడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నాడు. కానీ మిగతా దర్శకులు మాత్రం అలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వకుండా తమకు నచ్చిన కథను రాసుకొని తమకు నచ్చినట్టుగా సినిమాను చేసి ప్లాప్ లను మూట గట్టుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు డైరెక్టర్ అనేవాడు అప్డేట్ అవుతూనే ఉండాలి.

లేకపోతే మాత్రం మారుతున్న కాలంలో ఆయన మనుగడ అనేది అగమ్య గోచరంగా మారుతుందనే చెప్పాలి… ఒక సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరో భారీ సక్సెస్ ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తుంది అంటూ సినిమా మేకర్స్ అయితే ఈ మూవీ మీద చాలా అంచనాలను పెట్టుకున్నారు.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా అన్ని కుదిరితే ఆగస్టు 15వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. మొత్తానికైతే ఈ సినిమాని ఈ సంవత్సరం ఎండింగ్ లో రిలీజ్ చేసి ఒక భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…