Most expensive hotel in world : ప్రపంచం మారిపోతుంది. ఊహించినంత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు అవసరం అనే సమాధానం ఇస్తున్నది.. ఇప్పుడు అవసరమైపోయినది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. వెనుకటి కాలంలో బయట తిండ్లు తినేవారు కాదు. బయట ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు అలా కాదు.. బయట తిండి ఒక అలవాటు అయిపోయింది. బయట హోటల్స్ లో ఉండిపోవడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా హోటల్ బిజినెస్ లక్షల కోట్లకు చేరుకుంది. ఆతిధ్యరంగంలో హోటల్స్ దే ప్రముఖ పాత్ర. అందుకే పెద్ద పెద్ద సంస్థలు హోటల్ నిర్వహణ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో పెద్దపెద్ద హోటల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ ఒకటి నిర్మితమైంది. అందుబాటులోకి కూడా వచ్చింది. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉంది? అందులో ఒక్కరోజు బస చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గా అట్లాంటిస్ ది రాయల్ పేరుపొందింది. ఇది దుబాయ్ లో నిర్మితమైంది.. అప్పట్లో జరిగిన ఈ హోటల్ ప్రారంభ వేడుకలకు బియాన్స్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది. జే – జెడ్, కెండాల్ జెన్నర్, హేలీ బెయిలీ, రెబెల్ విల్సన్ వంటి తారలు హాజరయ్యారు. దుబాయ్ లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో ఒకటైన పామ్ జుమైరా వెలుపల ప్రాంతంలో ఈ హోటల్ నిర్మించారు. ఇది 43 అంతస్తులలో ఉంది.. ఈ హోటల్ ద్వారా దుబాయ్ స్కై లైన్, అరేబియా సముద్రాన్ని సరికొత్తగా ఆస్వాదించవచ్చు. ఈ హోటల్ లో ఉన్న రాయల్ మాన్షన్ అత్యంత ప్రత్యేకమైనది. పేరుకు తగ్గట్టుగానే ఇది రాయల్ లాగా ఉంటుంది. ఇందులో ఒక్కరోజు రాత్రికి బస చేయాలంటే దాదాపు ₹85 లక్షలు ఖర్చు పెట్టాలి. పన్నులు దీనికి అదనం. గతంలో ఈ రికార్డు లాస్ వేగాస్ లోని “ది ఎంపతి” హోటల్ పేరు మీద ఉండేది. ఈ హోటల్లో ఒక సూట్ లో బస చేస్తే దాదాపు ₹50 లక్షల దాకా చెల్లించాల్సి ఉండేది.
ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం
అట్లాంటిస్ రాయల్ 5 స్టార్ రేటింగ్ అవార్డు సొంతం చేసుకుంది. గత ఏడాది పోర్బ్స్ ట్రావెల్ గైడ్ స్టార్ అవార్డులలో ఫైవ్ స్టార్ పురస్కారం దక్కించుకుంది. అంతేకాదు క్రిస్టియానో రోనాల్డోను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఇటీవల ఈ హోటల్లో కంటెంట్ రైటర్ అలానా పాండే బస చేశారు. తాను బస చేసిన రూమ్ ను వీడియో తీశారు. ఆమె బస చేసిన రూమ్ లో నాలుగు బెడ్ రూమ్ లున్నాయి. స్టీమ్ బాత్రూంలు ఉన్నాయి. సినిమా థియేటర్, లైబ్రరీ, ప్రైవేట్ బార్, గేమ్ రూమ్ వంటివి ఆ రాయల్ సూట్ లో ఉన్నాయి. ఈ రాయల్ సూట్ నుంచి ఏపుగా పెరిగిన ఆలివ్ చెట్లను చూడటం ఒక చక్కటి అనుభూతి.
మొత్తం 795 గదులు
ఈ హోటల్లో మొత్తం 795 గదులు ఉన్నాయి..సూట్ లు, పెంట్ హౌస్ లు అదనం. ఈ హోటల్ నిర్మాణానికి 13,282 కోట్లు ఖర్చయ్యాయి. అంతర్జాతీయ చెఫ్ లు ఇందులో పని చేస్తున్నారు. ఈ హోటల్లో 17 ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు ఉన్నాయి.. ఈ హోటల్ లో బస చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. మధ్యస్థాయి వారికి కూడా సాధ్యం కాదు. శ్రీమతులకు మాత్రమే ఈ హోటల్లో బస చేసే అదృష్టం ఉంటుంది.