TANA : తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగానూ తానా ఆధ్వర్యంలో అనంతపురంలో సేవలందించారు. చలికి వణుకుతున్న వృద్ధులకు దుప్పట్లు పంచి పెట్టి ఉదారత చాటుకున్నారు.

తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి సహకారంతో అనంతపురం నగరంలో గల వృద్దాశ్రమాలలో గల 200 మంది వృద్ధులకు రగ్గులు, చీరలను పంపిణీ చేశారు.

మాజీ కార్పొరేటర్ పరిమి రాజా రావు ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ డి. పా ల్ వృద్దాశ్రమము, సురక్ష వృద్దాశ్రమము, ఆశ్రమ వృద్దాశ్రమము నందు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
