Waltair Veerayya Collections: అభిమాని డైరెక్టర్ గా మారి సినిమా తీస్తే ఎలా ఉంటుందో 10 ఏళ్ళ క్రితం ‘గబ్బర్ సింగ్’ అనే సినిమాకి చూసాం.. ఇప్పుడు మళ్ళీ అలాంటి అరుదైన దృశ్యంని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చూస్తున్నాం.. ఖైదీ నెంబర్ 150 చిత్రం తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా చెయ్యడం ఈ చిత్రంతోనే జరిగింది.. చిరంజీవిని చిన్నప్పటి నుండి మనం ఎలా చూసామో.. అలా చూపించాడు డైరెక్టర్ బాబీ.. ఈ సినిమాతో కామెడీ,యాక్షన్, డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇలా ఒక్కటా రెండా అభిమానులకు భుక్తాయాసం రప్పిచేలా చేసాడు.

ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి అయ్యింది.. ఈ నాలుగు రోజుల్లో అమెరికా నుండి అమలాపురం వరకు హౌస్ బోర్డ్స్ పడని థియేటర్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా అని లెక్కపెట్టుకోవాలి.. ఆ రేంజ్ లో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ని దున్నేసాడు.. ఈ నాలుగు రోజులకు కలిపి ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసుకుందాం..
-ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 20.31 కోట్లు
సీడెడ్ 11.36 కోట్లు
ఉత్తరాంధ్ర 7.15 కోట్లు
ఈస్ట్ 5.56 కోట్లు
వెస్ట్ 3.35 కోట్లు
నెల్లూరు 2.22 కోట్లు
గుంటూరు 4.81 కోట్లు
కృష్ణ 4.12 కోట్లు
మొత్తం 58.88 కోట్లు
ఓవర్సీస్ 9.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.30 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 73.68 కోట్లు

సైరా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత ఆ రేంజ్ వసూళ్లను మెగాస్టార్ సినిమాకి చూసింది ఈ చిత్రానికే.. గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు..కానీ అభిమానులు ఆ రెండు సినిమాల ఫలితాలకు ఎంత బాధపడ్డారో.. ‘వాల్తేరు వీరయ్య’ ఫలితం పై అంతకు మించి పది రెట్లు ఆనందపడ్డారు.. మొదటి వారం లోనే వంద కోట్ల రూపాయిల షేర్ కి అతి చేరువలో రాబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.