అమెరికాలో కరోనా విస్పోటనం: భారీగా కేసులు

అమెరికా కరోనాతో ఉలికిపడుతోంది. డెల్టా వేరియంట్ రకానికి చెందిన వైరస్ పెను ప్రభావం చూపుతోంది. డెల్టా వేరియంట్ వైరస్ వల్ల కొత్త కేసులు భారీగా పుట్టుకొస్తున్నాయి. వారం రోజులుగా వేల కొత్త కేసులునమోదవుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది. ఈ వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కొవిడ్ సెనెట్ కమిటీకి […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 4:30 pm
Follow us on

అమెరికా కరోనాతో ఉలికిపడుతోంది. డెల్టా వేరియంట్ రకానికి చెందిన వైరస్ పెను ప్రభావం చూపుతోంది. డెల్టా వేరియంట్ వైరస్ వల్ల కొత్త కేసులు భారీగా పుట్టుకొస్తున్నాయి. వారం రోజులుగా వేల కొత్త కేసులునమోదవుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది. ఈ వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

ఈ మేరకు ఓ నివేదికను కొవిడ్ సెనెట్ కమిటీకి అందజేసింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. మహమ్మారి దెబ్బకు తీవ్రంగా అమెరికా నష్టపోయింది. అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు రికార్డయింది ఇక్కడే. పాజిటివ్ కేసులు సంఖ్య మూడున్నర కోట్లను దాటిపోయింది. 3,50,81,719 లకు చేరింది. ఇప్పటిదాకా 6,25,363 మంది మరణించారు.

కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంా పెరగడం కవలరపరుస్తోంది. దీనికి కారణం డెల్టా వేరియంటేనని సీడీసీ డెరెక్టర్ రెచెల్లె వెల్సింకీ తెలిపారు. సెనెట్ కమిటీకి అందజేసిన నివేదికలో కీలక విషయాలు ప్రస్తావించారు. అమెరికా దక్షిణాది స్టేట్లలో కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయని, అర్కాన్సస్, ఫ్లోరిడా, మిస్సౌరీల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్నట్లు సీడీసీ డైరెక్టర్ చెప్పారు. వాటితో పాటు అలబామా, జార్జియా, లూసియానా, మిస్సిసిపి, టె్న్నెస్సె, టెక్సాస్ లల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అనుసరిస్తోన్న కరోనా నివారణ వ్యూహాలను పున:సమీక్షించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్ ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మరణాలు కూడా 48 శాతం పెరిగాయని చెప్పారు. జులై 3న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల నెలకొందని అన్నారు.

వ్యాక్సినేషన్ రేషియో తక్కువగా ఉన్న స్టేట్లు, ప్రాంతాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. కిందటి వారంతో పోల్చుకుంటే కొత్త కేసుల పెరుగుదల 145 శాతం మేర పెరిగిందని జాన్ హాష్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా పరిస్థితులు ఫోర్త్ వేవ్ కూడా దారి తీయొచ్చని మిస్సిసిపి స్టేట్ హెల్త్ ఆఫీసర్ తామస్ డాబ్స్ హెచ్చరించారు.