పవర్ లిస్టులో.. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ

జనాన్ని అమితంగా ప్రభావితం చేసే మాద్యమాల్లో సినిమా ముందు వరసలో ఉంటుంది. అందులో.. 24 క్రాఫ్ట్స్ ఉన్నా.. న‌టుల‌దే మొద‌టి ప్లేస్‌. ఇందులోనూ.. హీరోల‌దే అగ్ర‌స్థానం. అందుకే.. అభిమానులు త‌మ స్టార్ల‌ను త‌ల‌చుకొని ఉప్పొంగిపోతారు. వారు ఒక్క పిలుపు ఇస్తే.. స్పందించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ మ్యాగ‌జ‌న్ ‘హలో’.. 2021 పవర్ లిస్టును ప్రిపేర్ చేసింది. ఇందులో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రౌడీ హీరో విజ‌య్ […]

Written By: Bhaskar, Updated On : July 21, 2021 12:48 pm
Follow us on

జనాన్ని అమితంగా ప్రభావితం చేసే మాద్యమాల్లో సినిమా ముందు వరసలో ఉంటుంది. అందులో.. 24 క్రాఫ్ట్స్ ఉన్నా.. న‌టుల‌దే మొద‌టి ప్లేస్‌. ఇందులోనూ.. హీరోల‌దే అగ్ర‌స్థానం. అందుకే.. అభిమానులు త‌మ స్టార్ల‌ను త‌ల‌చుకొని ఉప్పొంగిపోతారు. వారు ఒక్క పిలుపు ఇస్తే.. స్పందించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ మ్యాగ‌జ‌న్ ‘హలో’.. 2021 పవర్ లిస్టును ప్రిపేర్ చేసింది. ఇందులో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చోటు సంపాదించారు.

వీరిద్ద‌రితో ఒక క‌వ‌ర్ స్టోరీని ప‌బ్లిష్ చేసింది. ఈ ఇద్ద‌రు హ్యాండ్సమ్ హీరోల‌ను ప‌క్క‌ప‌క్క‌నే చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. విజయ్ దేర‌కొండ‌ ఒకసారి మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుండి మహేష్ బాబు హార్డ్కోర్ అభిమానిని. ఆయ‌న సినిమా వ‌స్తే ఫ‌స్ట్ షో వెళ్లేవాడిని. టిక్కెట్ల కోసం దిల్ సుఖ్‌ నగర్ లోని కోణార్క్ థియేటర్ వద్ద క్యూలో నిలబడ్డాను’’ అని చెప్పాడు. ఇప్పుడు అదే మహేష్ తో కలిసి, మేగజైన్ కు వార్తగా మారడం ఖచ్చితంగా అతనికి అద్భుతమైన విషయమనే చెప్పాలి.

‘హ‌లో’ మ్యాగజైన్ రూపొందించిన ఈ ప‌వ‌ర్ లిస్టులో.. వివిధ రంగాల్లో ప్రభావ వంతంగా ముద్రవేసిన వారిని సెలక్ట్ చేశారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ను పిక్ చేసి, వారు సాధించిన విజయాలను, వారు చూపిన ప్రభావాన్ని వివరించారు. తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో.. విజయ్ ‘అర్జున్ రెడ్డి’తో ఓవ‌ర్ నైట్ స్టార్ గా ఎదిగి.. దాన్ని కాపాడుకునేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు.

కాగా.. ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. క‌రోనా కార‌ణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. అటు.. విజ‌య్ దేవ‌ర కొండ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్నాడు.