Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్టుల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ఈ ప్రకటన చేశాడు. కాగా, ఆయన తప్పుకోవడానికి గల కారణాలను కోహ్లీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టులో వివరించాడు.

Virat Kohli
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓటమి తర్వాతనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీని వన్ డే కెప్టెన్సీ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది. కాగా, తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తనంతట తాను తప్పుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయడానికి గల కారణాలను కోహ్లీ వివరించాడు. తాను ప్రతీ విషయంలో 120 శాతం పని చేయాలనుకుంటానని, అలా చేయకపోతే తనంతట తానే తప్పుకుంటానని తెలిపాడు. అలా ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాను కాబట్టే తాను నిజాయితీగా వన్ డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు.
Also Read: కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..
తాను టెస్టు జట్టు కెప్టెన్ గా తప్పుకోవాల్సిన సమయం ఇదేనని, తన ప్రయాణంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే, తన ప్రయత్నాలు, విశ్వాసం మాత్రం ఎన్నటికీ క్షీణించలేదని పేర్కొన్నాడు. తాను ఎల్లప్పుడూ ప్రతీ దానిలో 120 శాతం ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటానని, అలా చేయలేకపోతే తన తప్పుంటుందని భావిస్తానని కోహ్లీ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంత కాలం తన దేశానికి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకుగాను బీసీసీఐకి విరాట్ కోహ్లీ థాంక్స్ చెప్పారు.
తనకు తొలి రోజు నుంచి ఉన్న దృక్పథాన్ని విశ్వసించి, తనను నమ్మిన సహోద్యోగులకు కూడా తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కోహ్లీ అన్నాడు. తన ప్రయాణాన్ని చిరస్మరణీయంగా, అందంగా మార్చారని, రవి భాయ్‌తోపాటు సపోర్ట్ గ్రూప్‌లోని వారందరికీ థాంక్స్ చెప్పారు. కెప్టెన్‌గా తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విరాట్ కోహ్లీ. మొత్తంగా విరాట్ కోహ్లీ తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను సవివరంగానే ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నాడు.