Homeప్రవాస భారతీయులుAmerica: అగ్రరాజ్యంలో మరో దారుణం.. తెలుగు విద్యార్థి హత్య!

America: అగ్రరాజ్యంలో మరో దారుణం.. తెలుగు విద్యార్థి హత్య!

America: అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల హత్యలు కొనసాగుతున్నాయి. గత నెలలో ఐదురుగు వివిధ కారణాలతో మరణించగా, తాజాగా మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి అభిజిత్‌(20)ను కొందరు దుండగులు హత్య చేశారు. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్న అభిజిత్‌ను మార్చి 11న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశారు. స్నేహితుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన అమెరికా పోలీసులు మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా అభిజిత్‌ మృతధేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఇండియాకు పంపించారు.

చదువుకు కోసం వెళ్లి.. శవమై..
అభిజిత్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తమ కొడుకు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు భావించారు. కానీ విగత జీవిగా ఇంటికి రావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మార్చి 15న అభిజిత్‌ మృతదేహం స్వగ్రామం బుర్రిపాలెంకు చేరింది. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

జనవరిలో ఒకరు..
గత జనవరిలో కూడా భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. జనవరి 16న భారత్‌కు చెందిన వివేక్‌ సైనీ(25) బీటెక్‌ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ చేస్తున్నాడు. ఈ క్రమంలో జార్జియాలోని ఓ స్టోర్‌ వద్ద దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హత్యకు గురవ్వడం కలవర పెడుతోంది. ఇటీవల భారతీయుల మరణాలు అమెరికాలో పెరుగుతున్నాయి. అందులో హత్యలు జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version