America: అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల హత్యలు కొనసాగుతున్నాయి. గత నెలలో ఐదురుగు వివిధ కారణాలతో మరణించగా, తాజాగా మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి అభిజిత్(20)ను కొందరు దుండగులు హత్య చేశారు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్న అభిజిత్‌ను మార్చి 11న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశారు. స్నేహితుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన అమెరికా పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా అభిజిత్ మృతధేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఇండియాకు పంపించారు.
చదువుకు కోసం వెళ్లి.. శవమై..
అభిజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తమ కొడుకు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు భావించారు. కానీ విగత జీవిగా ఇంటికి రావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మార్చి 15న అభిజిత్ మృతదేహం స్వగ్రామం బుర్రిపాలెంకు చేరింది. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
జనవరిలో ఒకరు..
గత జనవరిలో కూడా భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. జనవరి 16న భారత్‌కు చెందిన వివేక్ సైనీ(25) బీటెక్ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. ఈ క్రమంలో జార్జియాలోని ఓ స్టోర్ వద్ద దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హత్యకు గురవ్వడం కలవర పెడుతోంది. ఇటీవల భారతీయుల మరణాలు అమెరికాలో పెరుగుతున్నాయి. అందులో హత్యలు జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.