https://oktelugu.com/

Vijaya Nirmala: విజయ నిర్మల కి యద్దనపూడి గారికి మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందంటే..?

ప్రముఖ నవల రచయిత్రి అయిన యద్దనపూడి సులోచన రాణి కి ఈమెకు మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. అందువల్లే ఆమె రాసిన కొన్ని నవలను సినిమాగా తీర్చిదిద్దింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 16, 2024 / 04:47 PM IST
    vijaya nirmala and yaddanapudi sulochana rani

    vijaya nirmala and yaddanapudi sulochana rani

    Follow us on

    Vijaya Nirmala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి విజయనిర్మల…ఈమె కృష్ణ గారితో వరుస సినిమాలు చేసి సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకుంది. ఇక చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించడమే కాకుండా దర్శకురాలుగా కూడా తన సత్తా ఏంటో చూపించింది.

    ఇక ఇది ఇలా ఉంటే ప్రముఖ నవల రచయిత్రి అయిన యద్దనపూడి సులోచన రాణి కి ఈమెకు మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. అందువల్లే ఆమె రాసిన కొన్ని నవలను సినిమాగా తీర్చిదిద్దింది. ఇక అందులో ముఖ్యంగా ‘మీనా ‘ అనే నవలని కృష్ణ హీరోగా విజయనిర్మల హీరోయిన్ గా అలాగే ఆమె దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించింది. దాంతో సూపర్ డూపర్ సక్సెస్ ని కూడా అందుకుంది. అయితే ఈ సినిమాకి చాలా మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇక మొత్తానికైతే కృష్ణ గారితో విజయనిర్మల చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక వీళ్ళ కాంబినేషన్ అప్పట్లో బెస్ట్ కాంబినేషన్ గా కూడా గుర్తింపు పొందింది.

    అలాగే నిజ జీవితంలోను ఆమె కృష్ణ గారిని పెళ్లి చేసుకొని ఆయనకి రెండో భార్య గా కూడా గుర్తింపు పొందింది. ఇక ఇదిలా ఉంటే యద్దనపూడి సులోచన రాణి విజయనిర్మల ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్…వాళ్ళు సినిమా విషయాలను మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇక ఆమె రాసిన నవలల్ని కూడా విజయ నిర్మల సినిమాలుగా చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    ఇక ఈ మీనా నవల స్టోరీ తోనే త్రివిక్రమ్ నితిన్ సమంత లను హీరో హీరోయిన్లు గా పెట్టుకొని అఆ సినిమా గా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక దాంతో నితిన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అలాగే తన మార్కెట్ ను కూడా భారీగా పెంచుకున్నాడు…ఇక మొత్తానికైతే యద్దనపూడి గారి చాలా నవలలను సినిమాలుగా చేసి మంచి విజయాలను అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు…