Sunil Mittal: బ్రిటన్ కింగ్ నుంచి పురస్కారం పొందనున్న తొలి భారతీయుడు ఇతడే..

పలు రంగాల్లో విశిష్ట విశేష సేవలు అందించిన విదేశీ పౌరులకు ఈ పురస్కారం(కేబీఈ)తో గౌరవిస్తారు. బ్రిటన్‌ పైరులకు నైట్‌హుడ్‌ ఇస్తే అందుకున్నవారి పేర్ల ముందు సర్‌ లేదా మేడమ్‌ హోదా ఇస్తారు.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 11:17 am
Follow us on

Sunil Mittal: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌, భారత్‌ వ్యాపార సంబంధాలను ప్రోత్సహించినందుకు బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ -3 చేతులమీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం నైట్‌హుడ్‌ పొందనున్నారు. యూకే కేబినెట్‌ ఆఫీస్‌ ఆవిష్కరించిన ఈ పురస్కారాల జాబితాలో మిట్టల్‌కు మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ను ప్రకటించారు. కింగ్‌ చార్లెస్‌ నుంచి మిట్టల్‌ ఈ గౌరవం పొందనున్నారు. ఇంతటి అరుదైన గౌరవం పొందనున్న తొలి భారతీయుడు మిట్టలే. అవార్డు ప్రధానోత్సవ తేదీని బ్రిటిష్ హైకమిషనర్‌ త్వరలో ప్రనకటించనుంది. భారత్‌లో మూడో అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్‌ పురస్కారాని‍్న 2007లోనే మిట్టల్‌ అందుకున్నారు.

గతంలో వీరికి..
పలు రంగాల్లో విశిష్ట విశేష సేవలు అందించిన విదేశీ పౌరులకు ఈ పురస్కారం(కేబీఈ)తో గౌరవిస్తారు. బ్రిటన్‌ పైరులకు నైట్‌హుడ్‌ ఇస్తే అందుకున్నవారి పేర్ల ముందు సర్‌ లేదా మేడమ్‌ హోదా ఇస్తారు. బ్రిటిష్‌ యేతరులకు ఈ పురస్కారం ఇస్తే వారి పేర్ల ముందు కేబీఈ, (మహిళలు అయితే డీబీఈ అని ఉంచుతారు. గతంలో బ్రిటిష్‌ యేతరులు ఈ పురస్కారం అందుకున్నారు. వారితో భారత్‌ నుంచి రతన్‌టాటా(2009), రవిశంకర్‌(2001), జెంషెడ్‌ స్తోత్ర ఇరానీ(1997)లో అందుకున్నారు. వీరికి దివంగత క్వీన్‌ ఎలిజిబెత్‌-2 పురస్కారం ప్రదానం చేశారు.

అంత్యంత గౌరవం..
బ్రిటన్ రాజు చార్లెస్ – 3 నుంచి దక్కిన ఈ గురి‍్తంపును అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు మిట్టల్‌ తెలిపారు. యూకే, భారత్‌ మధ్య సంస్థ చారిత్రక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పురస్కారంతో ఇవి మరింత బలపడతాయని అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దేశాన్ని ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా మార్చిన యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మిట్టల్‌ కృషి..
మిట్టల్‌ ఇటీవలే బ్రిటన్‌ ప్రభుత్వం, ఇతర పెట్టుబడిదారులతో కలిసి వన్‌వెబ్‌(ప్రస్తుతం యూటెల్‌ శాట్‌)ను పునరుద్ధరించారు. అంతర్జాతీయంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. లండన్ స్టాక్‌ ఎక్సే‍్ఛంజ్‌లో ఎయిర్టెల్ ఆఫ్రికా నమోదై ఉంది.