Japan: జపాన్ లో రాత్రి వేళ మాత్రమే స్నానం చేస్తారట? ఇంతకీ ఉదయం, సాయంత్రం స్నానానికి ఏ సమయం మంచిది?

రాత్రివేళ స్నానం చేయడం వల్ల పగటివేళ శరీరంలో పేరుకున్న మలినాలు, టాక్సిన్స్ పోతాయని, తద్వారా శరీరానికి విశ్రాంతి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల మనసు, శరీరం రెండు శుభ్రపడతాయని వారి నమ్మకం.

Written By: Srinivas, Updated On : March 1, 2024 11:22 am
Follow us on

Japan: భారతీయులు పూర్వకాలం నుంచే ఉదయం లేవగానే స్నానం చేస్తారు. దీని వల్ల ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటామని భావిస్తారు. అయితే ఇది గతం నుంచే సంప్రదాయంగా మారిపోయింది. అయితే ఇలా చేయడం వెనుక కొన్ని సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అయితే జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో మాత్రం ఉదయం కాకుండా రాత్రి వేళ స్నానాలు చేస్తారట. ఇలా చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? సైన్స్ ఏం చెబుతుంది వంటి వివరాలు మీకోసం..

రాత్రివేళ స్నానం చేయడం వల్ల పగటివేళ శరీరంలో పేరుకున్న మలినాలు, టాక్సిన్స్ పోతాయని, తద్వారా శరీరానికి విశ్రాంతి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల మనసు, శరీరం రెండు శుభ్రపడతాయని వారి నమ్మకం. ఈ కారణంగానే స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతామని కూడా నమ్ముతారు. అంతేకాదు రాత్రి పూట స్నానం చేయడం వల్ల మరికొన్ని విషయాలను కూడా నమ్ముతారట జపాన్ ప్రజలు.

జపనీస్ కార్మికులు ఒత్తిడితో కూడిన కూడిన పనులు చేస్తుంటారు. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల పని పూర్తి అయిందని, విశ్రాంతి తీసుకోవడానికి సమయం వచ్చిందని శరీరానికి సూచన ఇస్తున్నట్టుగా అనుకుంటారట. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక, శారీరక విశ్రాంతి పెరుగుతుందట. దక్షిణ కొరియా ప్రజలు చాలా గంటలు పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి రాత్రి వేళ స్నానం చేయడానికి ఇష్టపడుతారు. చైనా సంస్కృతిలో, రాత్రివేళ స్నానం చేయడం పరిశుభ్రతలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారట.

చైనా వాతావరణం చాలా తేమగా, తేలికపాటిగా ఉంటుంది.అందువల్ల స్కిన్ పై బ్యాక్టీరియా, దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. అయితే రాత్ర స్నానం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని నమ్ముతారట. అయితే ఉదయం పూట స్నానం చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఉదయానికి కావాల్సిన శక్తి వస్తుంది. రాత్రిపూట కలిగిన హ్యాంగోవర్ ను తొలగించి, ఫ్రెష్ నెస్ ను ఇస్తుంది. రాత్రి చెమట వచ్చేవారు ఉదయం తప్పనిసరిగా స్నానం చేయాలి. అయితే నిపుణులు కూడా రాత్రి స్నానానికే జై కొడుతున్నారట.

ఉదయం అలసట తీరి రాత్రి మంచి నిద్ర రావాలంటే రాత్రి స్నానం మస్ట్ అంటున్నారు. అంతేకాదు బెడ్ షీట్లకు దుమ్ము ధూళి నూనెలు కూడా అంటుకోకుండా ఉంటాయి. అయినా ఉదయం సాయంత్రం రెండు పూటల స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు స్నానం చేసేయండి.