YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి భారీ డ్యామేజ్ జరుగుతోంది. ఆ పార్టీపై విమర్శలు వచ్చిన క్రమంలో తిప్పి కొట్టే నేతలు లేరు. మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఆయన చిత్రపటం ఎదురుగా మేకను బలిచ్చారు. ఆ రక్తంతో అభిషేకం చేశారు. మరోచోట వేడుకల్లో భాగంగా ఇబ్బంది పెడుతున్న వారిని వద్దని వారించినందుకు ఒక గర్భిణీ తన్నాడు వైసీపీ నేత. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది దీనిపై. ఇటువంటి సమయంలో పార్టీ పరంగా వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆపై తప్పుడు చర్యలను ఖండించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. వాస్తవానికి ఇలాంటి విషయాలు నాయకులకు తెలియకపోవచ్చు. కొన్ని గ్రామస్థాయిలో యాదృచ్ఛికంగా జరిగిపోవచ్చు. అటువంటప్పుడు ఖండించి తీరాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
* పసలేని వాదన..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ఒక విధంగా నాయకత్వానికి ఇబ్బంది తెచ్చిపెడుతోంది. దానికి ఎక్కడో ఒకచోట చెక్ చెప్పాలి కానీ.. మీరు చేయలేదా అంటూ ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో కూడా జంతు బలి చేశారని.. ఓ జి సినిమా రిలీజ్ సమయంలో కూడా అదే పని జరిగిందని ఇప్పుడు కొత్తగా వైసిపి నేతలు చెప్పుకొస్తున్నారు. దానిని ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం జరిగినప్పుడు చెప్పి ఉంటే ప్రజల్లోకి వెళ్ళేది. కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు జరిగిన ఘటనలతో ఆ పార్టీకి నష్టం జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కొత్తగా విషయాన్ని బయట పెట్టడం ఏమిటనేది విశ్లేషకులు మాట. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
* మాట్లాడే నేతలు ఏరీ?
ఏదైనా ఒక అంశంపై మాట్లాడాల్సిన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువగా ఉంటారు. పేర్ని నాని, వరుదు కళ్యాణి, అంబటి రాంబాబు వంటి వారు మాత్రమే నిత్యం మీడియాతో మాట్లాడుతుంటారు. అయితే ఇతర నేతలు ఎవరు నోరు మెదపరు. పైగా మాట్లాడిన వారంతా వివాదాస్పద ముద్ర ఉన్నవారే. ఎంతో కొంత వరుదు కళ్యాణి సబ్జెక్ట్ పై మాట్లాడగలరు. అయితే సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్న వారు సైతం పాత ధోరణితో మాత్రమే ఉంటున్నారు. అప్పుడెప్పుడో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో జంతు బలులు జరిగితే ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు. ఎందుకంటే జగన్ జన్మదినం నాడు జంతు బలి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పార్టీకి డ్యామేజ్ జరగడంతో పాత విషయాలను బయట పెడుతున్నారు నేతలు. అయితే ఆ ఘటనలు జరిగి ఉండవచ్చు కానీ ఆలస్యంగా చెబితే.. వాటికి అంత విశ్వసనీయత కూడా ఉండదు.