Yogurt Eat every day: మనం ప్రతిరోజు తినే ఆహారంలో అన్నంతో పాటు కూర ఉంటే చాలని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం రెండు లేదా మూడు రకాల కూరలు, పాపడ, చపాతి వంటివి కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకొందరు అయితే వీటితోపాటు పెరుగు కూడా చేర్చుకుంటారు. ప్రతిరోజు పెరుగు లేకుండా వీరు ఆహారాన్ని తీసుకోరు. వాస్తవానికి పెరుగుతోనే భోజనం చేస్తే పరిపూర్ణ ఆహారం తీసుకున్నట్లు అని కొందరు పండితులు చెబుతారు. అయితే పెరుగు అనగానే కొందరికి ఇష్టం ఉండదు. అంతేకాకుండా కేవలం వేసవికాలంలో లేదా ఏదైనా వేడి చేసినప్పుడు మాత్రమే పెరుగును తింటూ ఉంటారు. కానీ ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎన్ని రకాల పోషకాలు శరీరంలోకి వెళ్తాయో తెలిస్తే.. వెంటనే పెరుగును కొనుగోలు చేస్తారు. మరి పెరుగులో ఉండే పోషకాలు ఏవి? శరీరానికి ఇవి ఏ రకంగా మేలు చేస్తాయి?
Read Also: ప్యారడైజ్ లో నాని లుక్ కి చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి సంబంధం ఉందా..?
పెరుగు చూడడానికి చాలా తేలికమైన పదార్థమే అని అనిపిస్తుంది. కానీ ఇందులో అనేక రకాల ప్రోటీన్లు ఉన్నాయి. తెలుగులో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. ఇది పాల నుంచి పెరుగుకు వస్తూ ఉంటుంది. కాల్షియం వల్ల శరీరంలో ఉండే ఎముకలు బలంగా మారుతాయి. అలాగే నోట్లోనే దంతాలు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతాయి. అందువల్ల ప్రతిరోజు పెరుగు తప్పనిసరిగా తినాలని అంటారు. అలాగే ఇందులో B2,B12 అనే విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్ లో శరీరంలోని నాడీ వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తాయి. అలాగే శరీరంలో అదనపు శక్తి రావడానికి ఈ విటమిన్ లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం వల్ల శరీరంలో జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో ఎక్కువగా మంట ఉన్న సమయంలో పెరుగు తినాలని చెబుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఈ లాక్టిక్ ఆమ్లం పేగుల్లో ఉండే మలినాలను తీసేస్తుంది. అలాగే ఎంతటి ఆహారాన్ని అయినా వెంటనే కరిగించేలా చేస్తుంది. భోజనం చేసే సమయంలో చివరిగా పెరుగు తినాలని చెబుతారు. అంతకుముందు తిన్న ఆహారం జీర్ణం కావడానికి పెరుగు తింటూ ఉంటారు.
Read Also: ఓజీ లో విలన్ క్యారక్టర్ మిస్ చేసుకున్న టాప్ స్టార్ హీరో అతనేనా..? చేసుంటే పాన్ ఇండియా దద్దరిల్లేది!
పెరుగులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. ఎప్పుడూ అలసటతో ఉన్నవారు.. నీరసంగా కనిపించేవారు.. పెరుగును తినడం వల్ల ఉత్సాహంగా మారుతారు. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండిపోతారు. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడానికి కూడా పెరుగును ప్రతిరోజు తప్పనిసరిగా తినాలి.
అయితే ప్రస్తుత కాలంలో కొన్ని రకాల పెరుగులు కల్తీగా ఉంటున్నాయి. అందువల్ల సాధ్యమైనంతవరకు ఇంట్లోనే పెరుగును తోడు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. సమయం లేదు అని అనుకుంటే నాణ్యమైన కంపెనీకి చెందిన పెరుగును మాత్రమే వాడుతూ ఉండాలి. లేకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .