The Paradise Chiranjeevi: నాచురల్ స్టార్ ‘నాని’ హీరోగా ‘శ్రీకాంత్ ఓదెల’ దర్శకత్వంలో వచ్చిన ‘దసర’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ సినిమా కూడా మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంటుంది. ఇంతకుముందు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వచ్చి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేసింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జడల్ అనే క్యారెక్టర్ తో నాని కనిపించబోతున్నాడు అంటూ ఆయన చేస్తున్న క్యారెక్టర్ నేమ్ ను కూడా రివిల్ చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా నాని లుక్కును కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన అడవి దొంగ సినిమాకు సంబంధించిన లుక్ ను పోలి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమాలో చిరంజీవి పొడగాటి జుట్టు ను పెంచుకొని అడవి మనుషిల కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే ఇందులో నాని పొడుగు జడలు వేసుకొని కనిపిస్తున్నాడు.
Also Read: ఒక్క ప్రాంతం నుండి గంటకు 50 వేల టిక్కెట్లు..’కూలీ’ సునామీ మొదలైంది!
మరి ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య సంబంధం ఏంటి? అది ఒక అడవి నేపథ్యంలో సాగిన సినిమా… మరి ఈ సినిమా కూడా ఒక ట్రైబల్ ఏరియాలో సాగబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక గతంలో ఈ సినిమా గ్లింప్స్ వచ్చిన సందర్భంలో ఒక ఏరియా లో ప్యారడైజ్ అనే వేశ్య గృహాలకు సంబంధించిన సినిమా ఇది అని తెలియజేశారు.
ఆ వేశ్యలకు జరిగిన ఇబ్బందులు ఏంటి.? వాళ్లకి నానికి మధ్య సంబంధం ఏంటి వాళ్లకు జరిగిన అన్యాయానికి నాని రివెంజ్ తీర్చుకున్నాడా? అనేది ఈ సినిమా కథంశంగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట నాని చేయబోతున్న సినిమాలతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఎంచుకున్న కథలు కూడా పాన్ ఇండియా నేపద్యంలో ఉండటం విశేషం…
Also Read: ది ప్యారడైజ్’ నుండి నాని ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఈ ‘జడల్’ ఏంటయ్యా బాబు!
ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయన ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే నాని లుక్కు ను చూసిన సినిమా మేధావులందరు చిరంజీవి అడవి దొంగ సినిమా లుక్కును పోలి ఉందని కామెంట్స్ చేస్తుండడం విశేషం…మరి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏదైనా సంబంధం ఉందా? అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…