YCP: నర్సాపురం ఎంపీ, వైసీసీ రెబల్ రఘురామ కృష్ణం రాజు ఎప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయనకు వార్తల్లో ఉండనిదే మనసున పట్టదు.దీంతో ఎల్లప్పుడు వైసీపీపై పోరాటం చేసే ఆయన ప్రస్తుతం రూటు మార్చారు. ఆర్యవైశ్యుల నాటకం చింతామణిని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడంతో నర్సాపురంలో ఆర్యవైశ్యులు ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఆర్యవైశ్యులతో ఎందుకు పెట్టుకున్నారంటే విమర్శలు చేస్తున్నారు. దీంతో రఘురామ పై ఆర్యవైశ్యలు నిప్పులు తొక్కుతున్నారు. మా కులం నాటకంపై ఆయనకెందుకు ఆసక్తి అని నిందిస్తున్నారు.
దీనిపై స్పందించిన రఘురామ తాను ఆర్యవైశ్యులను కించపరచలేదని చెబుతున్నారు. కేవలం చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రపై నే కామెంట్ చేశానని గుర్తు చేశారు. తనకు ఆర్యవైశ్యులంటే గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇదంతా అధికార పార్టీ వైసీపీ తనపై కావాలనే బుదర జల్లే పనిలో పడిందని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
Also Read: KCR-Jagan: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న జగన్ టీం
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రకు కులం పేరు పెట్టి దూషించడమెందుకని ప్రశ్నించానన్నారు. దానికి తనపేరు పెట్లినా బాధపడనని చెప్పుకొచ్చారు. దీనిపైనే నేను మార్పులు ఉండాలని కోర్టుకు నివేదించానని అంతే కానీ ఆర్యవైశ్యులను కించపరచేలా తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అంతేకానీ వైసీపీ నేతల ప్రోద్బలంతోనే తన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నట్లు తనకు తెలుస్తుందన్నారు. ఆర్యవైశ్యుల మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవిస్తానని చెప్పారు.
సుబ్బారావు గుప్తాను ప్రభుత్వం పిచ్చివాడిగా చిత్రీకరిస్తూ చిత్రహింసలు పెట్టినా స్పందించని వైసీపీ నాయకులు ప్రస్తుతం తాను కేవలం నాటకంలో పాత్రను మార్చాలని సూచిస్తే తనపై అధికార పార్టీ ప్రోద్బలంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇంకా ఎన్ని ఆగడాలు చేస్తుందో తెలియడం లేదన్నారు. తనకు రాజకీయ జీవితం కంటే ప్రజాజీవితమే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఆర్యవైశ్యులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Also Read: Jagan vs AP Employees: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!