https://oktelugu.com/

Actress Sudha: న‌న్ను వ్య‌భిచారానికి కూడా ప‌నికి రావ‌న్నాడు.. ల‌జెండ‌రీ డ్యాన్స్ మాస్ట‌ర్‌పై సుధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Actress Sudha: స‌హ‌జ న‌టి సుధ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హీరోల‌కు త‌ల్లి పాత్ర‌ల్లో, లేదంటే హీరోయిన్ల‌కు త‌ల్లి పాత్ర‌ల్లో ఆమె ఎక్కువ సినిమాల్లో న‌టించారు. త‌న‌దైన టైమింగ్ తో పాటు డైలాగుల‌తో అల‌రిస్తూనే ఉన్నారు. ఒక‌ప్పుడు తండ్రుల సినిమాల్లో న‌టించిన ఆమె.. ఇప్పుడు వారి కొడుకుల సినిమాల్లో కూడా న‌టిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆమె సినీ జీవితంలో కూడా అనేక చేదు జ్ఞ‌ప‌కాలు ఉన్నాయ‌ని ఆమె అంటున్నారు. సినిమా అంటే అంతే మ‌రి. […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 5, 2022 / 04:59 PM IST
    Follow us on

    Actress Sudha: స‌హ‌జ న‌టి సుధ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హీరోల‌కు త‌ల్లి పాత్ర‌ల్లో, లేదంటే హీరోయిన్ల‌కు త‌ల్లి పాత్ర‌ల్లో ఆమె ఎక్కువ సినిమాల్లో న‌టించారు. త‌న‌దైన టైమింగ్ తో పాటు డైలాగుల‌తో అల‌రిస్తూనే ఉన్నారు. ఒక‌ప్పుడు తండ్రుల సినిమాల్లో న‌టించిన ఆమె.. ఇప్పుడు వారి కొడుకుల సినిమాల్లో కూడా న‌టిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆమె సినీ జీవితంలో కూడా అనేక చేదు జ్ఞ‌ప‌కాలు ఉన్నాయ‌ని ఆమె అంటున్నారు.

    Actress Sudha

    సినిమా అంటే అంతే మ‌రి. తొలినాళ్ల‌లో ఎవ‌రికైనా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఒక స్థాయికి వ‌చ్చే దాకా అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో అవ‌మానాలు ఎదుర్కోవాల్సిందే. అయితే సుధ కూడా త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక బాధ‌లు, అవ‌మానాలు ప‌డిన‌ట్టు ఇప్ప‌టికే ఎన్నో ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చింది. ఇక‌పోతే త‌న‌కు జ‌రిగిన అత్యంత అవమాన క‌ర ఘ‌ట‌న గురించి ఆమె చెప్తూ ఎమోష‌న‌ల్ అయింది.

    Also Read: ‘నీ భర్త ముసలోడు’ అంటూ సునీత పై ట్రోలింగ్

    ఆమె ఓ త‌మిళ సినిమా చేస్తున్న‌ప్పుడు.. ఆ మూవీకి ప్ర‌భుదేవా తండ్రి సుంద‌రం మాస్టార్ కొరియోగ్రాఫ‌ర్ గా చేశాడంట‌. అయితే అందులో ఓ పాట‌కు సుధ ఎక్కువ టేకులు తీసుకున్నా కూడా స‌రిగ్గా చేయ‌లేక‌పోయింద‌ట‌. దీంతో సుంద‌రం మాస్ట‌ర్‌కు కోపం వ‌చ్చి అంద‌రి ముందే ఆమెను దారుణంగా అవ‌మానించారంట‌. నువ్వు వ్య‌భిచారానికి కూడా ప‌నికి రావంటూ కోప్ప‌డ్డారంట‌. దీంతో సుధ‌కు త‌ల కొట్టేసినంత ప‌ని అయిపోయిందంట‌.

    ఇదే విష‌యాన్ని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకుంటూ బాధ ప‌డింది సుధ‌. ఇంక జీవితంలో ఆయ‌న చేసే సినిమాల్లో చేయొద్ద‌ని అనుకున్నదంట‌. కానీ త‌న త‌ల్లి ప్రోత్సాహంతో త‌న న‌ట‌న తోనే ఆయ‌న‌కు బుద్ధి చెప్పాల‌నుకున్న‌ట్టు సుధ వివ‌రించింది. ఇక ఆ త‌ర్వాత అదే సుంద‌రం మాస్ట‌ర్ మూవీలో మ‌ళ్లీ అవకాశం ద‌క్కించుకుని ఈ సారి సింగిల్ టేక్ లో చేసి వావ్ అనిపించుకున్నాన‌ని సుధ చెప్పుకొచ్చింది. అంద‌రి ముందు ఆయ‌న చప్ప‌ట్ల‌తో త‌న‌ను అభినందించారంటూ వెల్ల‌డించింది.

    Also Read: షాకింగ్ : లతా మంగేష్కర్ పరిస్థితి విషమం

    Tags