World Rat Day : మీరు మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. ఏదో ఒక మూలన ఎలుకలు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ఇంట్లో అవి చేసే విధ్వంసం మాటల్లో చెప్పలేనిది. కొన్నిసార్లు వంటగదిలో ఉంచిన వస్తువులను చిందరవందర చేస్తుంటాయి. మరికొన్నిసార్లు బీరువాలో ఉంచిన దుస్తులను పాడుచేస్తాయి. అయితే, మురికి కాలువలు లేదా మురికి ప్రదేశాల నుంచి మీ ఇంట్లోకి ప్రవేశించే ఈ ఎలుకలు తమతో పాటు ప్రాణాంతకమైన అనేక వ్యాధులను కూడా తీసుకువస్తాయి. అంతేకాకుండా, ఇంటిలోని ఏదైనా మూలన ఎలుక చనిపోయినా అది అనేక వ్యాధులను వ్యాప్తి చేయగలదు. ప్రపంచ ఎలుకల దినోత్సవం సందర్భంగా.. ఎలుకల మరణం తర్వాత కూడా వ్యాప్తి చేసే వ్యాధుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
రాట్ బైట్ ఫీవర్ (Rat Bite Fever):
రాట్ బైట్ ఫీవర్ తరచుగా ఎలుకలు కరవడం లేదా వాటి మూత్రం లేదా లాలాజలంతో సంబంధం ఉండడం వల్ల వస్తుంది. మురికి కాలువలు లేదా మురికి నుంచి బయటకు వచ్చిన ఎలుకలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు అనేక రకాల బ్యాక్టీరియాలను తమతో పాటు తీసుకువస్తాయి. రాట్ బైట్ ఫీవర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
లెప్టోస్పైరోసిస్ (Leptospirosis):
ఈ వ్యాధి ఎలుకల మూత్రంతో సంబంధం వల్ల వస్తుంది. ఇది ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీని వల్ల బాధపడుతున్న వ్యక్తికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి , వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మరణానికి కూడా కారణమవుతుంది.
ప్లేగు (Plague):
ఇది కూడా ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది ఎలుకల వల్ల వస్తుంది. ఇందులో కూడా జ్వరం, అలసట, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ చికిత్స అందకపోతే ఇది తీవ్రంగా మారవచ్చు.
క్షయ (Tuberculosis):
ఇది ఒక రకమైన వైరస్, ఇది ఎలుకల మలం లేదా మూత్రంతో సంబంధం వల్ల వస్తుంది. ఇది నేరుగా మానవుల ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ దగ్గు కారణంగా ఊపిరితిత్తులలో నొప్పి ప్రారంభమవుతుంది. దగ్గుతో పాటు అలసట, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.