Wine shops: మడమ తిప్పను, మాట తప్పను.. ఈ మాటలు జగన్ ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో పదే పదే వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మద్య పాన నిషేధం వందశాతం చేసి చూపిస్తామంటూ ప్రకటించారు. కానీ చాలా విషయాల్లో మడమ తిప్పేస్తున్నట్టే… మద్యం విషయంలో కూడా మడమ తిప్పేస్తున్నారు జగన్. మద్యపాన నిషేధం విషయంలో మెల్లిమెల్లిగా వెనకడుగు వేస్తూ పాత పరిస్థితులను తీసుకొస్తున్నారు.

దీంతో మందుబాబులకు స్వీట్ షాకులు ఎక్కువయిపోతున్నాయి. మొన్నటి దాకా ఏపీలో మద్యం కొనాలంటే మాత్రం రాత్రి ఎనిమిది గంటల లోపే వైన్స్ షాపుకు వెళ్లేవారు. కానీ ఆ తర్వాత ఇంకో గంట పెంచుతూ 9గంటల దాకా పెట్టారు. ఇప్పుడు ఇది కూడా తక్కువయిపోయిందని భావించారో ఏమో గానీ.. ఇంకో గంట పెంచుతూ రాత్రి 10గంటల దాకా వైన్ షాపులకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఖాతాలు నిర్వహించుకునేందుకు ఇంకో గంట కూడా పర్మిషన్ ఇచ్చారంట.
Also Read: ఎలక్ట్రిక్ కెటిల్ పాడైపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..!
అంటే ఆ గంట అదనపు టైమ్ లో కూడా ఎవరైనా మద్యం కొనుగోలు కోసం వస్తే వారికి కూడా ఇస్తారని చెప్పారన్నమాట. మొత్తంగా రాత్రి 11గంటల దాకా మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని గవర్నమెంట్ ఇన్ డైరెక్టుగా చెప్పేసింది. ఈ నిర్ణయాన్ని చూస్తే మాత్రం గతంలో రాత్రి 11గంటల దాకా అమ్మకాలు జరిగినట్టే ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఏపీలో మళ్లీ కనిపిస్తాయన్నమాట. వాస్తవానికి జగన్ హామీ ప్రకారం. ఏడాదికి 20శాతం వైన్స్ షాపులు తగ్గించేయాలి.
ఇలా తగ్గిస్తూ చివరకు మొత్తం షాపులను తగ్గించేయాల్సి ఉండాలి. కానీ వాస్తవంగా ఏపీలో ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పుడు వైన్స్ షాపుల మీద ఉన్న ఆదాయం ఒక్కటే మార్గం అన్నట్టు జగన్ భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదుకే వాటిని తగ్గిస్తే ఆదాయం పడిపోతుందని జగన్ ఆలోచిస్తున్నారంట. ఇలా సమయం పెంచడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే పాత బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా వరుసగా మద్యం బాబులకు స్వీట్ షాకులు ఇస్తోంది.
Also Read: కేసీఆర్ మనసు మార్చుకోవడానికి కారణమేంటి?