Dhanush – Aishwarya: సినిమా పరిశ్రమలో ఇప్పుడు విడాకులు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వాళ్ళు ముగింపు పలుకుతూ ఓ ఉమ్మడి లేఖను కూడా రిలీజ్ చేశారు. “18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్ధం చేసుకొని మా ప్రయాణాన్ని సాగించాము.

అయితే, ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మాకు మేము వ్యక్తిగతంగా సమయం వెచ్చించుకోవాలని మాకు అనిపించింది. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం” అంటూ ధనుష్ ట్విటర్‌లో ఒక లెటర్ పోస్ట్ చేశాడు.
Also Read: ఎలక్ట్రిక్ కెటిల్ పాడైపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..!
మరోవైపు ఐశ్వర్య సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ ఇదే లెటర్ ను పోస్టు చేస్తూ తమ విడాకుల గురించి క్లారిటీ ఇచ్చింది. నిజానికి ధనుష్ – ఐశ్వర్య మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉంది. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ప్రేమగా మెలుగుతూ వచ్చారు. కానీ ఇలా సడెన్ గా ఒక్కసారిగా విడిపోతున్నాం అంటూ ప్రకటించడం అందరికీ షాక్ కి గురి చేసింది. రజినీకాంత్ కూడా ఈ విషయంలో చాలా బాధ పడినట్లు తెలుస్తోంది.
ఐశ్వర్య.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కు పెద్దకూతురు. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరి మధ్యలోకి వేరే వ్యక్తులు వచ్చారని.. ధనుష్ వేరే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని అందుకే అప్పటి నుంచి ఆమె ధనుష్ కి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఐతే, ధనుష్ వైపు నుంచి మరో వెర్షన్ వినిపిస్తోందట.
ఐశ్వర్య ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో బాగా క్లోజ్ గా ఉంటుందని.. పైగా ఆ మధ్య వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా పబ్లిక్ గా లీక్ అవ్వడం.. దాంతో ధనుష్ అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఈ రూమర్ అయితే బాగా వైరల్ అవుతుంది.
Also Read: వర్ధంతి: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడు ‘ఎన్టీఆర్’ !