Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిన్న ‘తంతి తమిళ టీవీలో’ సుమారు 54 నిమిషాల ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేషనల్, జాతీయ చానెల్స్ కు ఇచ్చాడంటే ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓ తమిళ ప్రాంతీయ చానెల్ కు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. తమిళ ప్రజలు చూసే చానెల్ ‘తంతి’ టీవీ. ప్రశ్నలు అడిగేవన్నీ తమిళంలోనే.. పవన్ కూడా తమిళం, ఇంగ్లీష్ కలిపి చెప్పాడు. అంతపెద్ద ఇంటర్వ్యూ ఒక పర్సస్ లేకుండా చేయడు కదా..
పవన్ కు ఇమేజ్ లేకుంటే తమిళ చానెల్ అంత సేపు ఇంటర్వ్యూ చేసేది కాదు.. జనసేన ఆవిర్భావ సభలో పవన్ తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడారు. పవన్ ‘హిందీ’ భాష వివాదంపై వ్యాఖ్యలకు తమిళ నేతలు బాగా రియాక్ట్ అయ్యారు. అంటే పవన్ వ్యాఖ్యలకు డీఎంకే సహా తమిళ నేతలు భయపడుతున్నట్టుగా అర్థమవుతోంది.
హిందీ భాష వివాదం, డీలిమిటేషన్ పై ఇంటర్వ్యూలో పవన్ సమాధానం ఇచ్చారు. తర్వాత తమిళ పార్టీలు, నేతలపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఇక అన్నామలై గురించి పవన్ మెచ్చుకున్నారు. మున్ముందు పెద్ద నాయకుడు అన్నామలై అవుతారని కొనియాడారు.
పవన్ తమిళనాడు 2026 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయని అర్థమవుతోంది ఎందుకు తమిళ టీవీ తంతి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో ఇంటర్వ్యూ చేసింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.