New Traffic Rules
Traffic Rules: రోజులు పెరుగుతున్న కొద్దీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణం వాహనదారులు క్రమపద్ధతిలో ప్రయాణించకపోవడమేనని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినంగా చేస్తూ ప్రభుత్వం జరిమానాకు సంబంధించిన ఛార్జీలను పెంచింది. గతంలో ఉన్న ఛార్జీలను సవరణ చేస్తూ భారీగా పెంచేసింది. అంతేకాకుండా కొన్ని నియమాలు ఉల్లంఘించడం వల్ల జైలు శిక్షలను కూడా ఖరారు చేసింది. ఇవి మార్చి 1 నుంచి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే కొన్ని చోట్ల వీటిని పక్కాగా అమలు చేస్తున్నారు. మరికొన్ని చోట్లు ఈ జరిమానాలు విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి జరిమానాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల ఎండ నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఒక మనిషిలో అన్నింటికంటే ముఖ్యమైనది తల. ఈ హెల్మెట్ ఆ తలను కాపాడుతుంది. అందువల్ల హెల్మెట్ తప్పక ధరించాలని వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ కొందరు దీనిని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 ఇప్పటి వరకు ఫైన్ ఉండేది. కానీ ఇప్పుడ రూ.100కి పెంచారు.
చాలా మంది చిన్న పిల్లలు బైక్ పై ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి డ్రైవింగ్ పై ఎక్కువగా అవగాహన ఉండదు. అవగాహన లేని డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారు డ్రైవింగ్ చేస్తే కొత్తగా రూ.25,000 ఫైన్ తో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే వీరికి 25 ఏళ్లు వచ్చే సరికి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అంతేకాకుండా వీరికి బైక్ ఇచ్చిన తండ్రిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల 18 ఏళ్లు నిండిన తరువాత లైసెన్స్ తీసుకొని వాహనం నడపాలి.
ఒక బైక్ పై ఇద్దరు ప్రయాణించడం సాధారణం. కానీ చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు. వీరిపై ప్రభుత్వం చర్చలు తీసుకోనుంది. ఒక బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1000 ఫైన్ విధించనున్నారు. అలాగే కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా మారింది. అలా సీటు బెల్ట్ పెట్టుకోని పక్షంలో ఇప్పటి వరకు రూ.100 మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని రూ.1000కి పెంచారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయినా కొందరు మద్యం తాగి వాహనం నడుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే రూ.1,500 జరిమానా విధించారు. ఇప్పుడు దానిని రూ.10, 000కు పెంచారు. ఈ ఫైన్ చెల్లించలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. అలాగే
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడినా.. డ్రైవింగ్ లైసెన్స్ సరిగ్గా లేకున్నా.. సిగ్నల్ జంపింగ్ చేసినా రూ.5,000 చెల్లించాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10,000 లేదా ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.