Character Artist Jayalalithaa: విభిన్న చిత్రాల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు వంశీ. గోదావరి పల్లెల్లో.. జానపద గీతాలతో తెలుగుదనం ఉట్టిపడేలా పచ్చని పల్లెల్లో మాత్రమే సినిమా తీసే ఆయనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తుంటారు. అలాగే వంశీ సినిమాల్లో నటించేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. 1982 నుంచి ఇప్పటి వరకు వంశీ సినిమాల్లో కొందరు నటులు ఎక్కువగా కనిపిస్తారు. వీరిలో జయలలిత ఒకరు. నాటి నుంచి నేటి వరకు వంశీ సినిమా అంటే అందులో దాదాపు జయలలిత కనిపిస్తారు. మరి ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
తెలుగు సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లోనూ స్టార్లుగా మారిన వారు ఉన్నారు. వీరిలో జయలలిత ఒకరు. మొదట్లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన జయలలిత ఆ తరువాత సహాయ నటిగా, విలన్ గా విభిన్న పాత్రల్లో నటించారు. అయితే ఆమెకు ‘సభకు నమస్కారం’ లాంటి పాత్రలు బాగా పేరు తెచ్చాయి. వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలో జయలలిత చేసిన యాక్టింగ్ కు ఆరోజుల్లోనే ఆమెకు ఫ్యాన్స్ పెరిగారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
వంశీ డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో జయలలిత ఉన్నారు. వీరి కాంబినేషన్లో ‘లేడీస్ టైరల్,’, ‘డిటెక్టివ్ నారద’ సినిమాలు ప్రధానమైనవి. అయితే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తరువాత మళ్లీ వంశీ సినిమాల్లో నటించారు. గోపిక, గోదావరి సినిమాలో జయలలిత మెయిన్ విలన్ కనిపించారు. ‘సరదాగా కాసేపు’ మూవీలో సహాయ నటిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో‘దీపారాధన’ అనే సీరియల్ లో నటిస్తున్నారు.
వంశీ సినిమాలు ప్రత్యేకమైనవి. ఆయన సినిమాల్లో ప్రధానంగా కామెడి, ఎమోషన్, సెంటిమెంట్ తో పాటు వ్యాంపు క్యారెక్టర్ ను కూడా పరిచయం చేస్తారు. ఈ పాత్రలో నటించడానికి ఎవరూ ముందుకువచ్చేవారు కాదట. నాటి వంశీ సినిమాలలో వ్యాంపు క్యారెక్టర్ కు జయలలిత సెట్ అయ్యేవారు. అంతేకాకుండా ఆయన అనుకున్న విధంగా జయలలిత నటించడంతో ఆమెపై ఇంప్రెస్ ఏర్పడింది. దీంతో తన సినిమాల్లో జయలలితకు తప్పకుండా అవకాశం ఇస్తారట. వీరే కాకుండా జీవా, అనంత్, తదితరుల కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. వంశీ డైరెక్షన్ చేసిన ‘సరదాగా కాసేపు’ సినిమాలో జయలలిత చివరి సారిగా కనిపించింది.