Virat Kohli- Naveen Ul Haq: ఇండియన్ క్రికెట్ టీం లో విరాట్ కోహ్లీ స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, కెప్టెన్ గా మరియు బ్యాట్స్ మ్యాన్ గా ఇండియన్ టీం కోసం అతను చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు, మాట్లాడుకుంటూ పోతే ఒక రోజు సమయం పడుతుంది. ప్రపంచం లోనే ఆయన ది బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన IPL లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో ఆయన గొప్పగా రాణిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే కోహ్లీ లో కొంతమందికి నచ్చని విషయం అగ్రెసివ్ సెలెబ్రేషన్స్. మ్యాచ్ గెలిచినప్పుడు కానీ, వికెట్ తీసినప్పుడు కానీ కోహ్లీ చేసే సెలెబ్రేషన్స్ అవతలి జట్టు టీం కి చాలా ఇబ్బంది మరియు కోపానికి గురయ్యేలా చేస్తాయి. నిన్న లక్నో టీం తో జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజుల బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జైన్ట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో టీం గెలిచింది. గెలిచినా ఆనందం లో ఆ టీం కోచ్ గౌతమ్ గంభీర్ RCB టీం ని వెక్కిరిస్తూ మ్యానరిజం చూపిస్తాడు. ఇది కోహ్లీ కి ఏమాత్రం నచ్చలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఇది గుర్తు పెట్టుకొని తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇది లక్నో సూపర్ జైన్ట్స్ టీం లో ఉన్న నవీన్ ఉల్ హక్ కి ఏమాత్రం నచ్చలేదు.
కోహ్లీ తో చాలా తప్పుగా మాట్లాడాడు, అగ్రెషన్ కి పెట్టింది పేరు లాంటి కోహ్లీ ముందు ఇలాంటివి కుప్పి గంతులు వేస్తే ఆయన ఊరుకుంటాడా, నవీన్ తన పట్ల ప్రవర్తించిన తీరు కి వంద రేట్లు ఎక్కువ రియాక్షన్ ఇచ్చాడు, నోటికొచ్చినట్టు బాగా తిట్టి, తన బూటు కాలుని చూపించాడు కోహ్లీ, అలా ఒక క్రికెటర్ పై బూటు కాలు చూపించడం తప్పు అని కొంతమంది అంటుండగా, కోహ్లీ కి ఆ రేంజ్ లో కోపం వచ్చిందటే, నవీన్ ఏమి చేసి ఉంటాడో, కోహ్లీ ని తప్పు పట్టడానికి లేదు అని మరికొంత మంది అంటున్నారు.
Virat Kohli vs Navin-ul-Haq in 17th Over.FULL FIGHT!!🔥 pic.twitter.com/BSMGgeKNCv
— ` (@45Fan_Prathmesh) May 1, 2023