HomeNewsPawan Kalyan: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?

Pawan Kalyan: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మొదటి నుంచి కాస్త దూకుడు గానే వ్యవహరించారు. మొదట టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ టైంలో జనసేనకు తక్కువ సీట్లే దక్కడంతో ఏ మాత్రం డిమాండ్ చేయకుండా ఉండిపోయారు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ను పట్టించుకోకపోవడంతో ఆయన కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు తెలిపారు.

తర్వాత రాజకీయ పరిణామాల వల్ల బీజేపీకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. కానీ ఇటీవల విశాఖ ఉక్కు కోసం ఏర్పాటు చేసిన సభలో పవన్ బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసినా.. అవి అంతగా పేలినట్టు అనిపించలేదు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఇక ఆయన ఎప్పుడు ఎలాంటి సభ పెట్టిన వైసీపీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవలే జిల్లాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని దాదాపుగా అందరూ సమర్థించిన జిల్లాల పేర్ల విషయంలో కొందరు కొన్ని కామెంట్స్ చేశారు. పలు పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ జనసేన అధినేత మాత్రం వీటిపైన ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. మరో వైపు ఇటీవలే ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంపైనా నెగెటివ్‌గా కానీ, పాజిటివ్‌గా ఇంకా పవన్ ఎలాంటి కామెంట్ చేయలేదు. మొన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన పవన్.. ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయ్యారనేది అర్థం కావడం లేదు.

ఆయన ఎందుకు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.. రాష్ట్రం ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే స్పందించే జనసేనాని ప్రస్తుతం మౌన దీక్ష చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన దీని వెనకాల ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? అనేది మాత్రం తెలియడం లేదు. మరో వైపు జనసైనికులు కూడా ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అయితే ఇదంతా పవన్ ముందస్తు ప్లాన్ లో భాగమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఆయన ఏమైనా ఆలోచనలు చేస్తాన్నారా? అని సైతం కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..

Pawan Kalyan Reaction on Union Budget 2022 | Janasena Party | Oktelugu

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

Exit mobile version