Allu Arjun: పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో అభిమానులు గుండెలు పగిలేలా రోధించారు. కన్నడలో ఎందరో స్టార్లు పుట్టుకొచ్చి.. రాజ్ కుమార్ వైభవాన్ని మరిచిపోయేలా చేస్తున్న తరుణంలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మళ్ళీ రాజ్ కుమార్ ఫ్యామిలీనే కన్నడ నాట నెంబర్ వన్ గా నిలబెట్టాడు. అందుకే పునీత్ అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ.

పైగా పునీత్ కి మిగిలిన ఇండస్ట్రీలలో కూడా మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్, బాలయ్య, చిరు, విశాల్ లాంటి హీరోలు సైతం పునీత్ కుటుంబాన్ని పరామర్శించి దైర్యం చెప్పారు. కాగా తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు.
Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!
ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ తర్వాత పునీత్ సమాధిని బన్నీ సందర్శించనున్నాడు. పునీత్ సమాధి వద్ద బన్నీ నివాళులు అర్పించనున్నాడు. అలాగే పునీత్ చేసిన సేవలో కూడా బన్నీ పాలు పంచుకోబోతున్నాడు. ముఖ్యంగా 1800 పిలల్లలకు పునీత్ చదువు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్లల్ని నేను చదివిస్తా…అని ముందుకు రాబోతున్నాడు బన్నీ.

ఆ 1800 మంది పిల్లల భవిష్యత్తుకీ భరోసా కల్పించడమే తన ఉద్దేశ్యం అని బన్నీ ఫీల్ అవుతున్నాడు. అలాగే పునీత్ స్టార్ట్ చేసిన అనాధశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు కూడా బన్నీ సాయం చేస్తానని ప్రకటించబోతున్నాడు.
Also Read: టాలీవుడ్: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
[…] Allu Arjun: కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు. ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ తర్వాత పునీత్ సమాధిని బన్నీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాడు. […]