MS Dhoni: టీమ్ ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుంది ? ఇన్నాళ్లూ మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా అభిమానులను అలరించిన ఈ స్టార్ క్రికెటర్.. హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది ? అవును.. ధోనీ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. ధోనీ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దీంతో తన అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాడు.

కాగా ‘అథర్వ ది ఆరిజిన్’ పేరిట సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే నవల ఆధారంగా ఈ సిరీస్ రాబోతుంది. ఇక ‘అథర్వ ది ఆరిజిన్’ పేరుతో గ్రాఫిక్స్ రూపంలో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహీ ఓ యోధుడి పాత్రలో నటించాడు. ఇక బుధవారం రాత్రి విడుదల చేసిన ఈ సిరీస్ టీజర్ చాలా బాగుంది. ముఖ్యంగా ‘అథర్వ ది ఆరిజిన్’గా ధోని రెండు చేతుల్లో కత్తులను పట్టుకొని కనిపించాడు.
Also Read: ప్చ్ బుచ్చిబాబు.. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఇక రాక్షసుల గుంపును సంహరిస్తున్న ధోనీ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ధోని ఈ సిరీస్ టీజర్ ను తన ఫేస్‌బుక్ లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. రమేశ్ తమిల్‌మని అనే కొత్త రచయిత ఈ కథను రాశారు. కాగా సిరీస్ నిర్మాణానికి ధోనీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థ సహకారం అందిస్తుండటం విశేషం.

ఈ నవల ధోనికి బాగా నచ్చింది అట. అందుకే.. ఈ సిరీస్ నిర్మాణంలో ధోని కూడా పాలు పంచుకున్నాడు. ఇక 2016లో మహీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కూడా సూపర్ హిట్ అవుతుంది అని ధోని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సిరీస్ లో ధోనితో పాటు మిగిలిన పాత్రల గురించి.. అలాగే మిగిలిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=p5IvBCOvEYg
Also Read: టాలీవుడ్: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !