Sleep: పడుకునేటప్పుడు ఈ వైపు తల పెట్టకూడదు. ఆ వైపు తలపెట్టకూడదు అని విన్నారా? ఇంతకీ నిజంగా ప్రత్యేకమైన వైపుకు మాత్రమే తల పెట్టి పడుకోవాలా? ఇవన్నీ పిచ్చి వాళ్ళు చేసే పనులు అని కొట్టిపారేస్తున్నారా? ఇలాంటి నమ్మకాలలో వాస్తవం ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి నిద్రపోవడానికి సరైన దిశ ఏది? ఏ వైపు తల పెడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరం.. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దట. దీని వల్ల ప్రశాంతమైన నిద్ర పట్టదట. రాత్రంతా ఇబ్బందిగా, కల్లోలంగా ఉంటుంది. తీవ్రమైన అలసట, ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం వంటివి జరుగుతాయట. నిద్ర మధ్యలోనే మేల్కొంటారు. భూమికి ఉత్తరం వైపు ధనావేశంతో ఉంటుందట. మనిషి తల కూడా అంతే ధనావేశంతోనే ఛార్జ్ అవుతుంది. రెండు అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి కల్లోల పరిస్థితులను తీసుకువస్తాయట.
తూర్పు.. తూర్పు వైపు తలపెట్టి నిద్రించడం ఎంతో మంచిది. ఈ వైపుకు తలపెడితే ధ్యాన నిద్ర కలుగుతుంది. అందమైన కలలు, మంచి జ్ఞాపకాలు వస్తుంటాయి. ఈ వైపు తల పెడితే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే చాలా మంది తూర్పు వైపుకే తల పెట్టి నిద్రించాలి అంటారు.
దక్షిణం..దక్షిణం రుణావేశం తో కూడి ఉంటుంది. ఇటు వైపు తల పెట్టి పడుకుంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంటుంది. కాబట్టి మంచి నిద్ర పట్టి గాఢమైన నిద్రను పొందుతారు. దీనివల్ల శరీరంలో నుంచి శక్తి కూడా బయటకు వెళ్లదట. సో ఉల్లాసంగా ఉండేందుకు ఆరోగ్యానికి దక్షిణం వైపు తల చేయండి.
పడమర.. ఈ వైపు కూడా తల పెట్టి పడుకోవచ్చు. కానీ ఈ వైపు తలపెట్టి నిద్ర పోతే స్థిరమైన నిద్ర ఉండదు. నిద్రలోనే మెలుకువలు రావడం, కలత చెందడం, పీడకలలు రావడం వంటివి సంభవిస్తాయి. నిద్ర పడుతుంది కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు.
నిద్రలేమి సమస్యలతో బాధపడినా, పీడకలలు సతమతం చేస్తున్నా ఒకసారి మీరు పడుకునే దిశను మార్చి పడుకోండి. రిజల్ట్ కనిపిస్తే కంటిన్యూ చేయండి. లేదంటే ఆపై మీ ఇష్టం. ఖర్చు లేని పని బాస్.. మారిస్తే తప్పేముంది?