Boxing day Test డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్ మొదలవుతుంది. ఈ టెస్టులో టీమిడియా కచ్చితంగా గెలవాలి. ఎందుకంటే గత రెండు బాక్సింగ్ డే టెస్టులలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు విజయం సాధించడం టీమ్ ఇండియాకు అత్యంత అవసరం. ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటివరకు 9 బాక్సింగ్ డే టెస్ట్ లలో పోటీ పడింది. కేవలం రెండు మ్యాచ్లో మాత్రమే భారత్ గెలిచింది. మిగతా ఐదింట్లో ఆస్ట్రేలియా గెలుపును సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి. భారత్ – ఆస్ట్రేలియా 1985లో తొలిసారి బాక్సింగ్ డే టెస్ట్ ఆడాయి. ఆ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఆ తర్వాత జరిగిన ఐదు టెస్టులలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2014లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ డ్రా గా ముగిసింది. 2018లో విరాట్ కోహ్లీ టీం మీడియా కెప్టెన్ గా ఉండగా.. అప్పుడు జరిగిన బాక్సింగ్ డే టెస్టులో.. భారత్ విజయం సాధించింది.. బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా కు అలా తొలి విజయం లభించింది. 2020లో రహానే ఆధ్వర్యంలో టీమిండియా బాక్సింగ్ డే టెస్టులో అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో రహానే 112 పరుగులతో అదరగొట్టాడు..
మెల్ బోర్న్ వేదికగా..
మెల్ బోర్న్ వేదికగా భారత జట్టు ఇప్పటివరకు 14 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు సార్లు విజయం సాధించింది. 8 మ్యాచ్లలో పరాజయం పాలయింది. రెండు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన గత రెండు బాక్సింగ్ డే టెస్ట్ లలో భారత్ గెలుపులను దక్కించుకుంది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలకమైన దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ మరోసారి విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. బాక్సింగ్ డే సందర్భంగా అన్ని జట్లతో కలిపి భారత్ 18 టెస్ట్ లు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు మాత్రమే టీమ్ ఇండియా సాధించింది..మూడు మ్యాచ్ లను డ్రా గా ముగించింది. గత రెండు మ్యాచ్లలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన అంత గొప్పగా లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నేపథ్యంలో ఆటగాళ్ల తీరుపై విమర్శల వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెల్ బోర్న్ టెస్టులో ఆటగాళ్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేలవమైన ఫామ్ తో నిరాశ పరుస్తున్నారు. వారు తమ పూర్వపు లయను అందుకోవాల్సిన అవసరం ఉంది. బౌలర్లు కూడా అదరగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బలమైన ఆస్ట్రేలియాను పడగొడితేనే టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. లేకుంటే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.