https://oktelugu.com/

Telangana BJP: బీజేపీ లేసేదెప్పుడు? కాంగ్రెస్ ను దించేదెప్పుడు.. ఇదంతా కావాలంటే ఏం చేయాలి

విజయ దరహాసం తో పార్లమెంట్ లో అడుగు పెట్టారు స్టేట్ బీజేపీ నేతలు. రాష్ట్రం నుంచి కేంద్ర కెబినెట్లోకి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డి, బండి మంత్రులుగా మారిపోయారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం పార్టీలో మునుపటి జోష్ కనిపించట్లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2024 / 03:09 PM IST

    Telangana BJP

    Follow us on

    Telangana BJP: ఏంటిది ఈసారి రాష్ట్రంలోనూ బీజేపీ నే నట కదా.. ఎక్కడ చూసినా ఇదే అనుకుంటున్నరు.. గులాబీ వర్సెస్ కమలమే ఉంటదట.. కాంగ్రెస్ మూడో ప్లేసేనంట.. గాలి కాషాయం వైపే ఉందంటున్నరు.. అక్కడ మోడీ.. ఇక్కడ ‘బండి’ పేరే మారుమోగుతుందట.. ఈ తాప ‘కమలం’కు పవర్ ఖాయమే అంటున్నరు.. ఇదంతా ఎన్నికల ముందు రాష్ట్రంలో పువ్వు పార్టీ పరిస్థితి. తెలంగాణ చీఫ్ గా సంజయ్ పాదయాత్ర కొనసాగిన చివరి రోజుల్లో కని(విని)పించిన సందర్భ సన్నివేశాలు.. ఏమైనదో ఏమో అధిష్టానం నుంచి బండికి పిలుపు. స్పాట్లో ఢిల్లీకి పయనం. ఆ వెంటనే సంజయ్ ప్లేస్ లోకి వచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలేం జరుగుతోందో అని కార్యకర్తల్లో అయోమయం. ఆ తదుపరి శాసనసభ ఎన్నికలు రానే వచ్చాయి.. అధిష్టానం మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే మకాం వేసింది. మోడీ, అమిత్ షా వంటి కీలక నేతలు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి ప్రచారాన్ని హోరెత్తించారు.

    ఇక ఓటరు తీర్పు రానే వచ్చింది. మూడో స్థానం అనుకున్న ‘మూడు రంగులే’ విజయతీరంలో నిలిచాయి. బీజేపీకి ఫలితం ఆశాజనకమే అయినా అధికారానికి చాలా దూరంలో నిలిచింది. ఒక్క సీటు నుంచి 8 సీట్లకు చేరడం కొంత ఊరట నిచ్చే అంశం. హేమాహేమీలకు సైతం ఓటమి తప్పలేదు. సంజయ్, ఈటల, రఘునందన్ వంటి కీలక నేతలు పరాజయం పాలయ్యరు. అయితే గట్టి పోటీ మాత్రం ఇవ్వగలిగారు. ఆ వెంటనే లోక్ సభ ఎన్నికల సైరన్ మోగింది. కాషాయ అధిష్టానం మళ్లీ వారిపైనే నమ్మకముంచి బరిలోకి దింపింది. ఈ సారి మాత్రం ఫలితం అనుకున్నట్టుగానే వచ్చింది. ఓటమి చారలను ఆరు నెలల్లోపే చేరుపేసుకొని విజయ దరహాసం తో పార్లమెంట్ లో అడుగు పెట్టారు స్టేట్ బీజేపీ నేతలు. రాష్ట్రం నుంచి కేంద్ర కెబినెట్లోకి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డి, బండి మంత్రులుగా మారిపోయారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం పార్టీలో మునుపటి జోష్ కనిపించట్లేదు.

    -ఏడాది గడిచినా..

    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఓ పక్క బీఆర్ఎస్ హస్తం పార్టీపై నిత్యం విమర్శలు, ఆరోపణలు.. చాలెంజ్లతో పొలిటైటికల్ హీట్ పెంచుతోంది. కాషాయం పార్టీలో మాత్రం నాటి దూకుడు కనిపించడం లేదు. ఎప్పుడో ఓ సారి ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారే తప్ప ప్రజా పోరాటాల్లో ఎక్కువగా కనిపించడం లేదనే అపవాదు వినిపిస్తోది. జనంలో చొచ్చుకపోయే నేత అవసరం అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఢీకొని 2028లో నైనా అధికారంలోకి రావాలంటే ఇదే సరైన సమయం అని పొలిటికల్ విశ్లేషికులు భావిస్తున్నారు. రానున్న స్థానిక సమరంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడడంతో పాటు అనుకున్న ఫలితాలు రావాలంటే మాస్ లీడర్ తోనే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల, బండి, రఘునందన్ వంటి మాస్ లీడర్ కెప్టెన్ షిప్ తో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనేది మెజార్టీ అభిప్రాయం. లేకపోతే ఆ పార్టీకి మళ్లీ పాత రోజులు గుర్తుకురావచ్చనేది పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్.

    – సంపత్, సీనియర్ జర్నలిస్ట్