https://oktelugu.com/

Christmas Special: శాంటా గిఫ్ట్‌లు ఎందుకు ఇచ్చుకుంటారు? ఇంతకీ శాంటా ఎవరు?

ధనికుడైన ఓ వృద్ధుడు ఎవరూ లేకుండా ఒంటరిగా జీవించేవాడు. అయితే టైమ్ పాస్ కోసం రోజూ సాయంత్రం బయటకు వెళ్లేవాడు. ఇలా వెళ్లే సమయంలో చాలా మంది తిండి, బట్టలు లేకుండా రోడ్డు మీద జీవనం సాగించడం చూశాడు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2024 / 02:56 PM IST

    Christmas Special

    Follow us on

    Christmas Special: క్రిస్మస్ వస్తుదంటే చాలు.. అందరికీ శాంటా గిఫ్ట్‌లు గుర్తు వస్తాయి. ఎందుకంటే క్రిస్మస్‌కి ప్రతీ ఆఫీస్, చర్చ్‌లలో శాంటా గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. అంటే ఒక కంపెనీలో ఉన్న అందరి పేర్లను ఒక బాక్స్‌లో వేస్తారు. ఒక్కోరి ఒక్కో పేరును తీసుకుంటారు. అందులో ఎవరి పేరు ఉంటే వారికి మీరు గిఫ్ట్ ఇవ్వాలి. దీన్నే శాంటా గిఫ్ట్ అని అంటారు. అయితే హిందూ పండుగలకు ఎలా ఒక్కో పద్ధతికి ప్రత్యేకత ఉంటుందో అలాగే శాంటా గిఫ్ట్‌కి కూడా ఓ అర్థం ఉందట. ఈ బహుమతులను సరదాకి ఇవ్వరట. సాయానికి ఇస్తారట. అసలు ఎవరైనా పండుగలకు కొత్త బట్టలు లేదా వస్తువులు కొనుకుంటారు. కానీ ఈ గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం ఏంటి? అసలు శాంటా క్లాజ్ ఎవరు? ఈ శాంటాను తాత ఎందుకు అంటారు? ఎలా పుట్టారు? అసలు నిజంగానే శాంటా క్లాజ్ ఉన్నారా? పిల్లలకు ఎందుకు ఈ శాంటా క్లాజ్ గిఫ్ట్‌లు ఇస్తారనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    శాంటా క్లాజ్ ఎలా పుట్టాడంటే?
    ధనికుడైన ఓ వృద్ధుడు ఎవరూ లేకుండా ఒంటరిగా జీవించేవాడు. అయితే టైమ్ పాస్ కోసం రోజూ సాయంత్రం బయటకు వెళ్లేవాడు. ఇలా వెళ్లే సమయంలో చాలా మంది తిండి, బట్టలు లేకుండా రోడ్డు మీద జీవనం సాగించడం చూశాడు. వారిని చూసి మనస్సు చలించిపోవడంతో రాత్రి సమయాల్లో వారికి తెలియకుండా వెళ్లి దుప్పట్లు, బట్టలు, ఆట వస్తువులు ఇలా అన్ని ఇచ్చేవాడు. అయితే తన స్వరూపం కనిపించకుండా తలకు టోపి, కోటు ధరించి ఇలా సాయం చేసేవాడు. అయితే ఆ వృద్ధుడు సాయం చేసిన రోజు క్రిస్మస్. దీంతో జీసస్ ఆ శాంటా క్లాజ్‌ను పంపించారని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్ తాతగా పిలుస్తున్నారు. ఇలా సాయం చేయడానికి ఈ శాంటా క్లాజ్‌ను జరుపుకుంటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో అందరూ కూడా సరదాకి శాంటా క్లాజ్‌ను జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి పిల్లలకు ఆట వస్తువులు, గిఫ్ట్‌లు ఇలా క్రిస్మస్ తాత వచ్చి ఇస్తారని అంటుంటారు.

    ఇంకో కథ కూడా..
    క్రిస్మస్ తాత గురించి ఇంకో కథ కూడా ఉంది. 13వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఒకడు ఉండేవాడు. ఇతను ఒక బీదరైతు. ఇతనికి ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు. ఈ ముగ్గురు అమ్మాయిలకి పెళ్లి చేయలేక ఎంతో ఇబ్బంది పడేవారు. అయితే అతని సమస్యను గుర్తించిన ఒక బిషప్ తనకి సాయం చేయాలనుకున్నాడు. దీంతో ఆ బీదరైతు ఇంటి పైన ఉన్న పొగ గొట్టం నుంచి మూడు బంగారు నాణేలు ఉన్న సంచులు వేస్తారు. దీంతో పొయ్యిలో పడతాయి. వాటిని చూసిన ఆ బీదరైతు తమ కష్టాలు తీరిపోయాయాని సంతోషిస్తాడు. ఈ డబ్బుతో తన ముగ్గురు కుమార్తెల వివాహం చేయవచ్చని భావిస్తాడు. ఈ విషయాన్ని ఆ బీదవాడు ఇరుగు పొరుగున ఉన్నవారికి చెబుతాడు. దీంతో వారంతా కూడా తమకి ఏదైనా సాయం అందుతుందని ఆశిస్తారు. ఇలా బిషప్ తనకి ఉన్నంతలో సాయం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మరికొందరు కూడా ఇలా తెలియకుండా క్రిస్మస్ తాత రూపంలో సాయం చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా కూడా క్రిస్మస్ తాత వచ్చాడని చెప్పుకుంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.