Viral Video: ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు మంచి ఉదాహరణ. సునామి అనగానే సముద్రాల్లో వస్తుందని మనకు తెలుసు.. కానీ ఇక్కడ ఆకాశంలో సునామీ వచ్చినట్లు ఈ వీడియోలో ఉంది. సముద్రాల్లో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్ధలయినపుపడు మాత్రమే సునామీలు వస్తుంటాయి. ఆకాశంలోనూ సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడు కెమెరాలకు చిక్కుతాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూసే అవకాశం కలిగింది.
అద్భుతమైన వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ఆకాశం పైనుంచి సునామీ లాంటి నీళ్లు అలలు అలలుగా కిందకు జారిపడుతున్నాయి. ఆకాశంపైన సునామీ లాగా కనిపించిన ఈ విజువల్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. @CosmicGaiaX అనే యూజర్ నేమ్ ఉన్న ఒక ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. 12 సెకన్ల టైమ్‌లాప్స్ క్లిప్ ఇది. ఇందులో ఒక అందమైన పర్వత ప్రాంతం కనిపిస్తుంది. ఆ పర్వతాల కింద ఒక సరస్సు ఉంటుంది. ఆకాశంలో బ్లాక్, బ్లూయిష్–గ్రే కలర్ క్లౌడ్స్ చూడవచ్చు. అవి ముందుకు కదులుతూ ఉంటే భారీ వర్షం ప్రారంభమవుతుంది.
సునామీలా వర్షం
ఈ అసాధారణ వీడియోలో చినుకుల వర్షంలా కాకుండా ఒక సముద్రంలో అలలు పోటెత్తినట్లు ఆకాశం నుంచి కిందకు పడుతుంది. దిగివచ్చిన నీరు సరస్సును తాకుతుంది. ఈ సీన్ చాలా అందంగా కనిపిస్తుంది. చూడడానికి అందగా కనిపిస్తున్నా అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండడమే మంచింది. ఇక ఈ దృశ్యాన్ని మరో కోణంలో పరిశీలిస్తే.. ఆకాశంలోని మేఘాలకు చిల్లు పడినట్లు కనిపిస్తాయి.
ఆస్ట్రియాలో ఈ దృశ్యం..
ఇక ఈ వీడియోలోని దృశ్యం ఆస్ట్రియాలోని లేక్ మిల్‌స్టాట్ సమీపంలో తీశారు. దీనిని పీటర్ మైయర్ అనే ఒక వ్యక్తి రికార్డు చేశాడు. గాలి ఒత్తిడిలో హఠాత్తుగా మార్పు రావడం వలన నీరు ఇలా కిందపడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక బలమైన తుఫాను ముందు మేఠాలు వేగంగా కదులుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే నిపుణులు ఎవరూ దీనిపై స్పందించలేదు.
నెటిజన్ల రియాక్షన్
ఇక ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వెనిజులాలో ఇలాంటి వర్షం 10 నుంచి 15 నిమిషాలు కురుస్తుంది. ఆ తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోతుంది అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రకృతి చాలా అద్భుతమైన శక్తి. గొప్ప పోస్ట్ అని మరొకరు ప్రశంసిచారు. అంతటి భయంకర వర్షంలో చిక్కుకోవాలని నేను అనకోవడం లేదు.. వావ్ అని మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ దృశ్యం చాలా బాగుంది. అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 1,50,000లకుపైగా వ్యూస్ వచ్చాయి. 3 వేల వరకు లైక్స్ వచ్చాయి.
2022లోనూ వైరల్
ఇదిలా ఉంటే.. 2022లో ఇలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. వాటి మధ్య ఒక్కటే తేడా ఉంది. ఆ వీడియోలో పర్వత ప్రాంతంలో బదులుగా, ఒక రద్దీగా ఉండే నగరంపై మేఘాలు కుండపోత వర్షం కురిపించాయి. రెడిట్‌లో పంచుకున్న ఈ వీడియోలో భయంకరమైన, చీకటి మేఘాలు నగరంపై భారీ వర్షాన్ని కురిపించడం కనిపించింది.
Tsunami from Heaven ️pic.twitter.com/oVn3PQIlEP
— Cosmic Gaia (@CosmicGaiaX) June 30, 2024