Thangalan vs Kanguva : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో వరస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులలో విక్రమ్ ఒకరు. హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఈయన వరుసగా సినిమాలు చేస్తాడు. ఇక ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని అందులో నటించి మెప్పించడం లో ఈయన మించిన నటుడు మరొకరు లేరు. ఇక ఇలాంటి క్రమం లోనే విక్రమ్ ప్రస్తుతం ‘తంగలన్ ‘ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మరొక నటుడు సూర్య.. ఈయన హీరోగా శివ డైరెక్షన్ లో వస్తున్న ‘కంగువ ‘ సినిమా కూడా దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఇలాంటి క్రమంలో సూర్య పాన్ ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క సినిమాతో కూడా సక్సెస్ కొట్టలేదు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి తను కూడా మార్కెట్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే దాదాపు వీళ్ళిద్దరూ కూడా హీరోగా ఒకేసారి కెరియర్ ని మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళలో ఈ రెండు సినిమాలతో ఎవరు భారీ సక్సెస్ ని సాధిస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక పెను సవాలుగా మారింది. వీళ్లిద్దరు కూడా బాలా తీసిన ‘శివపుత్రుడు ‘ సినిమాలో కలిసి నటించారు. అలాగే బయట కూడా వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. మరి ఇలాంటి క్రమం లో వీళ్ళ మధ్య సినిమాలా పరంగా పోటీ అనేది ఉండడం ఒకంతుకు మంచి విషయమే అయినప్పటికీ, మరి వీళ్ళలో ఎవరు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎవరు హిట్టు కొట్టినా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగానే అది పరిగణించబడుతుంది.
కాబట్టి తమిళంలో నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రస్తుతం పాన్ ఇండియాలో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా భారీ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా మాదిరిగానే వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి అందుకోసమే వాళ్ళు అనుకున్నట్టుగానే తమిళ్ ఇండస్ట్రీ సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం అది ఈ రెండు సినిమాల మీదే డిపెండ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో విజయ్ హీరోగా వచ్చిన లియో సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయినప్పటికీ అది ఆశించిన విజయాన్ని సాధించలేదు.
ఇక జైలర్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్నప్పటికీ దానికి కలెక్షన్ల పరంగా అయితే బాలీవుడ్ లో పెద్దగా కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్న ఈ స్టార్ హీరోల సినిమాలే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి బెంచ్ మార్కుగా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక వీళ్లు కనక బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ని రాబడితే తమిళ్ సినిమా ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ఇండస్ట్రీ గా గుర్తింపు పొందుతుంది…